రావు రమేష్ ఉంటే చాలు.సినిమాకు అది పెద్ద ఎస్సెట్ అయిపోతుందని ఫీలై పోయేవారు ఈ మధ్యన ఎక్కువైపోయారు.దానికి కారణం రావు రమేష్ తో చెప్పించే డైలాగ్స్ సినిమాల్లో భాగా పేలడమే. ఓ కాంప్లికేటెడ్ సీన్ సీరియస్ నెస్ పెంచడం కోసం... అది మరింతగా హైలెట్ కావడం కోసం ప్రజెంట్ రావు రమేష్ ను రకరకాలుగా వాడేసుకుంటున్నారు.ఇదంతా భాగానే ఉంది.కాని ఈమధ్యన రావుగాపోల్ రావుగారి అబ్బాయి అయిన మన రావు రమేష్ దూకుడు చూసి... ఇక ప్రకాష్ రాజ్ పనైపోయిందనే వారు ఎక్కువైపోయారు.మనోడు రావడం వలన ప్రకాష్ రాజ్ పై ప్రభావం పడిందనే మాట చాలా వరకు వాస్తవమే.అయితే ప్రకాష్ పండించే వైవిధ్య నటన రావు రమేష్ ఎంత వరకు పండిస్తాడనే మాట ఇప్పుడైనా.. ఓ సారి విశ్లేషించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రకాష్ రాజ్ - రావు రమేష్ నటనల మధ్య తేడాను చూస్తే... మనకు కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హీరోను నిలబెట్టి కడిగేసే డైలాగ్స్ డెలివరీ చేయడంలోను,విలనిజాన్ని పీక్స్ లో చూపించడంలోను ప్రకాష్ సూపర్ సక్సెస్ అయ్యాడు.ఫ్యాక్షనిస్ట్ దగ్గర నుంచి పోలీసాఫీసర్ వరకు చేసిన అన్ని పాత్రల్లోను ప్రకాష్ పండిపోయాడు. మరి రావు రమేష్ విషయం వచ్చేసరికి అతను ఏ పాత్ర చూసిన తనకు వచ్చిన అదే డైలాగ్ డెలివరీను కాస్త అటు ఇటుగా మార్చి ఒకటే ఊపుతో చెప్పేస్తూ ఉంటాడు. ఇది ఇవ్వాళ మనకు భాగున్నప్పటికీ రేపన్న అది ప్రేక్షకులకు మొనాటిని అయిపోతుంది. అలాంటి సంధర్బంలో మనకు మళ్లీ ప్రకాష్ రాజ్ అవసరం ఏర్పడుతుంది.ఇంకో రకంగా చూస్తే...పూరి - గుణ శేఖర్ లాంటి దర్శకులు.... చిరంజీవి - మహేష్ లాంటి వారు ప్రకాష్ రాజ్ ను ఇప్పట్లో వదులుకోరు.సో ఆ యాంగిల్లో చూసినా అతను చేసేవి తెలుగులో రెండు - మూడు సినిమాలే అయినా.. తనకొచ్చిన పాత్రలను మరింత పదునుగా ఉండేలా జాగ్రత్త పడతాడు.
ఇక రావు రమేష్ ఇపుడున్న ఊపును బట్టి...ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసినా వాటిలో మూడు నాలుగు సినిమాల్లో పాత్రలకే అతనికి పేరొస్తుంది.కరెక్ట్ గా అదే సంధర్బంలో రావు రమేష్ - ప్రకాష్ రాజ్ ల నటనపై మళ్లీ ప్రేక్షకుడు విశ్లేషణ చేసుకుంటాడు.అప్పుడైనా సినీ జనాలకు అసలు విషయం తెలుస్తోంది.రావుగారబ్బాయితో ప్రకాష్ రాజ్ కు ఇప్పట్లో ఏదో కొద్దిగా పోయినా..లాంగ్ టైమ్లో వచ్చేదే తప్ప పోయేదేమి ఉండదని.