టాలీవుడ్ లో టాప్ రేంజులో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు రోజుకు లక్ష నుంచి 5లక్షల వరకూ అందుకుంటారని విన్నాం. ఒక్కో సినిమాకి 40-50లక్షల వరకూ ఆర్జించే వీలుంది. బ్రహ్మానందం - అలీ- ధర్మవరపు వంటి వాళ్లు ఈ రేంజులో ఆర్జించారు.
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏకంగా కోటిన్నర పారితోషికం అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరాయన? అంటే.. ది గ్రేట్ రావు రమేష్.. రావు గోపాల్రావ్ వారసుడు. ఇప్పటికే ఇండస్ట్రీలో రావు రమేష్ ప్రస్థానం తెలిసినదే. ఏడాదికి రెండు డజన్ల సినిమాలకు కమిటయ్యే నటుడిగా అతడి రేంజు గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఇన్నాళ్లు సినిమా రేంజును బట్టి లక్షల్లో పారితోషికం అందుకున్న ఆయన ఏకంగా ఈసారి బల్క్ కాల్షీట్లు కేటాయించి ఆల్మోస్ట్ లీడ్ రోల్ లో నటించాల్సిన సినిమాకి కోటిన్నర పారితోషికం అందుకుంటున్నారని తెలిసింది.
గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన నాయట్టు అనే సినిమాకి తెలుగు రీమేక్. ఇది మూడు పాత్రలతో నడిచే ఆసక్తికర డ్రామా .. విష్ణు- రావు రమేష్- అంజలి పేర్లు ఆ మూడు పాత్రలకు వినిపిస్తున్నాయి. అయితే ఇతరులు ఓకే కానీ రావు రమేష్ కాల్షీట్లు ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఓకే అంటే వెంటనే మొదలు పెట్టండి అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారట. ఇక ఈ సినిమా కథ వినగానే రావు రమేష్ వెంటనే ఓకే చేశారని తెలిసింది. ఇక కాల్షీట్లు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కోటిన్నర పారితోషికం ఫిక్స్ చేశారని తెలిసింది. స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. దర్శకుడు సహా ఇతర పనులు చేయాల్సి ఉంది. ఏదేమైనా ఒక స్టార్ రేంజులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.