ఆ బెడ్ సీన్లు నా కొంపముంచాయి.. యంగ్ హీరోయిన్

Update: 2020-04-27 12:10 GMT
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో కుర్రకారుకి మతిపోగొడుతోంది ఈ భామ. తొలి సినిమా ఊహలు గుసగుసలాడేతోనే స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసింది. ఇక అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. మంచి హిట్ సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా విషయంలో తను చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చింది రాశీ. ఆ సినిమానే ఇటీవలే విడుదలై బోల్తా కొట్టిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

ఈ సినిమాలో విజయ్‌తో కలిసి రాశి రొమాన్స్ పండించింది. రాశి ఖన్నా సినిమా కోసం ఎంత గ్లామర్‌ అయినా ఒలికించడానికి సిద్ధంగా ఉంటుంది. గ్లామర్ షోకి అసలు వెనకాడదు. అలాగని తనకంటూ గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకుందట. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం మాత్రం హద్దులు దాటి బెడ్‌ సీన్‌లో నటించింది. ఆ సీన్లో నటించేటప్పుడు జరిగిన కొన్ని అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది రాశి. ఎంతటి సినిమా అయినా ఇకనుండి నేను పెట్టుకున్న హద్దులు దాటొద్దని నిర్ణయించుకున్నా. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకోసం నా హద్దులు చెరిపేసా అంటుంది రాశి.

విజయ్‌తో రోమాంటిక్ సీన్ మా పేరెంట్స్ కి చెప్తే.. వారు టెన్షన్ పడ్డారు. అలాంటివి పట్టించుకోకండి అని చెప్పినట్లు తెలిపింది. ఇక బెడ్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ టైంలో విజయ్ నాతో ఒక మాట చెప్పాడు. రాశి ఆల్రెడీ నాకు అదే ఇమేజ్ ఉంది. కానీ నీకు ఇది కొత్త. నీకు నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఆ సన్నివేశం చేసిన తర్వాత ఇలాంటివి అవసరమా.. ఫ్యాన్స్ నన్ను రాశి ఖన్నాలాగే ఇష్టపడతారు. అలాంటి సన్నివేశాలలో నటించడం తనకు ససేమిరా ఇష్టం లేదని తన అభిప్రాయాన్ని బయట పెట్టింది బ్యూటీ రాశి. చూడాలి మరి ఇక పై రాశి ఎలాంటి పాత్రలతో మెప్పిస్తుందో..!
Tags:    

Similar News