అందాల రాశీఖన్నా మంచి ఫిట్ నెస్ ప్రియురాలు. నిత్యం యోగా..జిమ్ వర్కౌట్లు అంటూ కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ఆ మధ్య కాస్త చబ్బీ లుక్ లో మారుతోందన్న విమర్శ తెరపైకి రావడంతో వెంటనే వాటిని కసరత్తులతో తిప్పి కొట్టింది. పూర్తిగా స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది. సన్నజాజి సోయగంలా మారిపోయి యువత అటెన్షన్ డ్రా చేసింది.
అప్పటి నుంచి ఫిట్ నెస్ పై మరింత శ్రద్ద వహిస్తుంది. బాడీలో ఇంకా మార్పులు కొరుతుంది. దీంతో జిమ్ సమయాన్ని సైతం పెంచింది. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తోన్న ఓ ఫోటో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో రాశీఖన్నా పనితనం చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ ఫోటోని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
`స్ర్టాంగర్ ఎవ్రీ డే`..`రెడీ టూ కిక్` సమ్ అంటూ వర్కౌట్ మొదలు పెట్టడానికి ముందు ఇలా ఫోజు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మెలితిరిగిన మజిల్ ఎమోజీని ని కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. జిమ్ విషయంలో రాశీఖన్నా ఎంత సీరియస్ గా ఉందో..ఎంతటి డెడికేషన్ చూపిస్తుందో ఈ ఫోటోతోనే అర్ధమవుతుంది. మరి సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేస్తుందా? లేడీ డాన్ రోల్ ఆఫర్ ఏమైనా వచ్చిందా? ఏమో.
ఇక రాశీఖన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన `పక్కా కమర్శియల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన `థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
తెలుగు లో ఈ రెండు మినహా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో మళ్లీ `యోధ` సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ రీలాంచ్ అవుతుంది. తొలుత `మద్రాస్ కేఫ్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన విధంగా కెరీర్ బిల్డ్ అవ్వలేదు. దీంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది. మళ్లీ రీలాంచ్ కి రెడీ అయింది. ఇందులో సిద్ధార్ధ్ మల్హోత్రాతో రొమాన్స్ చేస్తుంది. సాగర్ అంబోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.