అందాల రాశీ ఆ రీల్ ఏంటి అమ్మ‌డు?

Update: 2022-09-05 00:30 GMT
ఢిల్లీ బ్యూటీ రాశీఖ‌న్నా టాలీవుడ్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. అందం..అభిన‌య‌మో..ట్యాలెంట్ కార‌ణ‌మా? అన్న‌ది తెలియ‌దు గానీ.. టాలీవుడ్ మాత్రం అమ్మ‌డిని తొలి నుంచి బాగానే ప్రోత్స‌హిస్తుంది. యంగ్ హీరోల నుంచి ఇప్పుడిప్పుడే సీనియ‌ర్ హీరోల‌కు ప్ర‌మోట్ అవుతోంది. కెరీర్ తొలి నాళ్ల‌లో సైడ్ ఆర్టిస్ట్ గా న‌టించిన అమ్మ‌డిని తెలుగు ప‌రిశ్ర‌మ‌నే హీరోయిన్ ని చేసింది. న‌టిగా డే బై డై మ‌రింత షైన్ అవుతోంది.

ఇటీవ‌లే `పక్కా క‌మ‌ర్శియ‌ల్` తో యావ‌రేజ్ స‌క్సెస్  ని  ఖాతాలో వేసుకుంది.  కోలీవుడ్ లో `స‌ర్దార్` స‌హా మ‌రో చిత్రం చేతిలో ఉంది. ఇక హిందీలో `యోధ‌`లో న‌టిస్తోంది. ఇలా అన్ని భాష‌ల్లోనూ అమ్మ‌డు బిజీగానే కొన‌సాగుతుంది. ఇలా ఎంత బిజీగా ఉన్న బ్యూటీ సోష‌ల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాని త‌న‌దైన శైలిలో హీటెక్కిస్తుంటుంది.

తాజాగా కొన్ని డిజైన‌ర్ ఎంపిక‌ల్లో ఇన్ స్టా రీల్స్ చేసింది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్స్ లో రాశీ మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. ఓ హిందీ సాంగ్ కి సింక్ అయ్యే ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. `కోయి వ‌హా నాచే నాచే` సాంగ్ కి  రాశీ మంచి ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ చేసిన  డాన్స్ వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో వీడియో ని మ‌రింత హైలైట్ చేస్తున్నారు.

బ్యూటీ ఇలాంటి వీడియోలు చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అని చెప్పాలి. గ‌తంలోనూ కొన్ని హిందీ పాట‌ల‌కు త‌న‌దైన హావ‌భావాల‌తో ఆక‌ట్టుకుంది. వాటికి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నంతోనే ముందుకొచ్చింది. గ్లామ‌ర్ విష‌యంలో అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో  కొన్ని మిన‌హాయింపులు  ఇస్తోన్న సంగ‌తి  తెలిసిందే.  యువ‌త‌ని ఆక‌ట్టుకునే భంగిమ‌ల‌తో ఇన్ స్టాలో చెల‌రేగుతోంది.  ఆఛేంజ్ వ‌చ్చిన నాటి నుంచి అమ్మ‌డి ఖాతా పాలోవ‌ర్స్ పెరిగారు. తాజాగా రొటీన్ కి భిన్న‌మైన  ప్ర‌య‌త్నాల‌తో ముందుకు సాగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.


Full View
Tags:    

Similar News