మాది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా.. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడండి.. అంటుంటారు సినీ జనాలు. తమ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉన్నా.. ‘కుటుంబ సమేతంగా’ అనే మాటను మాత్రం వదలరు. ఐతే రష్మి గౌతమ్ మాత్రం అలాంటి హిపోక్రటిక్ కబుర్లు చెప్పట్లేదు. తన కొత్త సినిమా ‘గుంటూరు టాకీస్’కు పిల్లల్ని తీసుకెళ్లొద్దని తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తోంది. తమది ‘ఎ’ రేటెడ్ మూవీ అని.. కొంచెం బోల్డ్ సీన్స్ - బోల్డ్ సాంగ్స్ ఉంటాయని.. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్లకపోతేనే బెటర్ అని.. ఇది బాధ్యతతో చెబుతున్న విషయం అని చెప్పి ఆశ్చర్యపరిచింది రష్మి. ఇలా నిజాయితీగా అప్పీల్ ఇవ్వడం గొప్ప విషయమే అని చెప్పాలి.
‘గుంటూరు టాకీస్’లో తన బోల్డ్ అవతారం గురించి కూడా బోల్డ్ గా మాట్లాడేస్తున్న రష్మి.. ఈ సినిమా తన కెరీర్ కు పెద్ద మలుపును తీసుకొస్తుందని కాన్ఫిడెంటుగా చెప్పింది. స్లమ్ గర్ల్ గా నటిస్తూ అంతగా రెచ్చిపోవడమేంటి అని అడిగితే.. ‘‘మామూలుగా పల్లెటూళ్లలో అమ్మాయిలు, అబ్బాయిలకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐతే తమకు ఏ అడ్డూ లేకుండా ఒక రోజంతా గడిపే పరిస్థితి వచ్చినపుడు.. ఒక అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రవర్తిస్తారో ఆ సన్నివేశాల్లో, పాటల్లో చూపించాం. కథలో భాగంగానే ఏదైనా చేశాం’’ అని చెప్పింది రష్మి. ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధుతో ఎఫైర్ అంటూ వస్తున్న రూమర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘నేనో యంగ్ గర్ల్. నాకు అబ్బాయిలతో ముడిపెట్టడం సహజం. దీన్ని లైట్ తీసుకుంటా’’ అని చెప్పింది రష్మి.