రౌడీ ని - బన్నీని అడిగితే యాసిడ్ పోస్తా!

Update: 2018-07-30 09:29 GMT

'గీత గోవిందం' సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యాడు.  'గీత గోవిందం' ఫన్ థీమ్ కు తగ్గట్టే ప్రతి ఒక్కరూ ఫన్నీగా స్పీచ్ ఇవ్వడం ఓ విశేషం.   ఆఖరికి కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ ఫన్నీ స్పీచ్ ఇచ్చింది.   యాంకర్ సుమ రష్మిక ను స్టేజ్ మీద కు పిలిచి "గోవిందం చాలా మారాలన్నారు.. మరి ఏం మారాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు? అని అడిగింది.   రష్మిక సమాధానమిస్తూ "చాలా  మారాలి. అతను చాలా ఇరిటేటింగ్ - ఇబ్బంది పెట్టే రకం."  దీనికి కొనసాగింపుగా సుమ 'మేం చూస్తాం.. ఎంత ఇరిటేటింగ్ గా ఉన్నాడో' అని సినిమా రిలీజ్  అయిన తర్వాత గోవిందం గురించి తెలుస్తుందనే ఉద్దేశంతో కామెంట్ చేసింది.

ఆ తర్వాత రష్మిక ఆడియన్స్ కు ఓ స్వీట్ & ఫన్నీ వార్నింగ్ కుడా ఇచ్చింది.  "అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ అల్ బన్నీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడాలని నాకు తెలుసు.  కానీ టూ మినిట్స్ నేను మాట్లాడతాను. ఓకే నా.  ఇంకొక్కసారి రౌడీ కావాలి బన్నీ గారు కావాలి అంటే మాత్రం యాసిడ్ పోసేస్తా.  అందరూ అరుపులు ఆపండి." టీమ్ మెంబర్స్ కు థ్యాంక్ యు అంటూ అందరి పేర్లను ప్రస్తావించింది.  అందరిలోనూ ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ మణికందన్ పేరు చెప్పినప్పుడు మాత్రం రచ్చ చేసింది.  మణికందన్ స్టేజ్ మీద వచ్చేవరకూ వదల లేదు.

తామందరం స్క్రీన్ మీద అందంగా కనిపించడానికి కారణం మణి సర్ అని చెప్పి మరీ స్పెషల్ గా థ్యాంక్ యు చెప్పింది. ఆ తర్వాత తమ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ అవుతోందని - గీత మేడమ్ అమ్మాయిల గురించి చెప్పే విషయాలు నేర్చుకోవాలంటే ఆ రోజు థియేటర్ లో సినిమా చూడండి అని కోరింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News