లేడీ కామ్రేడ్‌ 4 నెలల క్రికెట్‌ 4 నెలల డబ్బింగ్‌

Update: 2019-07-11 09:56 GMT
విజయ్‌ దేవరకొండ.. రష్మిక మందన్న జంటగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ లో తెరకెక్కిన చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'. ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న సినిమా కోసం పడ్డ కష్టంను చెప్పుకొచ్చింది.

రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేస్తున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్‌ చేసుకుంటాను. క్రికెటర్‌ పాత్రలో నేను సినిమాలో నాలుగు నిమిషాలు కనిపిస్తానేమో. అలాంటి దాని కోసం ఏకంగా నాతో నాలుగు నెలల పాటు క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేయించారు. ఆ క్రికెట్‌ సీన్స్‌ ను 20 రోజుల షెడ్యూల్‌ లో చిత్రీకరించారు. ఆ సమయంలో నాకు ఏడుపే వచ్చింది. ఒల్లు నొప్పులు కాళ్లు చేతుల నొప్పులతో ఇబ్బంది పడ్డాను ఏదోలా పూర్తి చేసిన తర్వాత డబ్బింగ్‌ ను నాతో నాలుగు నెలల పాటు చెప్పించారు. ఎవరండి నాలుగు నెలల పాటు డబ్బింగ్‌ చెప్పిస్తారు. మొన్న కూడా ఒక సీన్‌ లో సరిగా రాలేదు అంటూ మళ్లీ చెప్పించారు. సర్‌ సినిమా విడుదల దగ్గరకు వస్తుంటే ఇప్పుడు డబ్బింగ్‌ ఏంటీ అని నేను అన్నా కూడా లేదమ్మ ఒక్క సీన్‌ అంటూ మళ్లీ చెప్పించారంటూ రష్మిక సరదాగా కామెంట్స్‌ చేసింది. మొత్తానికి ఈ చిత్రం కోసం అందరు చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చింది.

గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ మరియు రష్మికల కాంబో మూవీ అవ్వడంతో అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. మరి ఈ చిత్రం ట్రైలర్‌ సినిమాపై ఇంకా అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి అంచనాలను ఈ సినిమా రీచ్‌ అవుతుందా అనేది చూడాలి.
Tags:    

Similar News