కమర్షియల్ సినిమాల వైపు రష్మిక అడుగులు...?

Update: 2020-03-29 04:30 GMT
రష్మిక మందన... టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. 'ఛలో' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ భామ తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే 'సరిలేరు నీకెవ్వరూ', 'భీష్మ' చిత్రాల ద్వారా మంచి విజయాలను అందుకున్నారు. వరుసగా ఆమె ఖాతాలో విజయాలు నమోదవుతూ ఉండటంతో, వరుసగా అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన సక్సెస్ రేట్ ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళుతోంది. ఈ కారణంగానే హిందీ రీమేక్ జెర్సీ లో ఛాన్స్ ను వదులుకుంది.

ఈ మధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ 'హిందీ జెర్సీ లో చేయమని అడిగారు.. కానీ నేను అంగీకరించ లేదు. జెర్సీ మంచి సినిమా కాదని కాదు.. అది రియలిస్టిక్ మూవీ. ప్రస్తుతానికి నేను ఈ తరహా సినిమాలు చేయదలచుకోలేదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందువల్లనే జెర్సీ హిందీ రీమేక్ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాను' అని చెప్పుకొచ్చింది. వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక కేవలం కమెర్షియల్ చిత్రాల్లోనే నటించాలనే తన నిర్ణయం కరెక్టేనా అని ముందు రోజుల్లో చూడాలి.
Tags:    

Similar News