రష్మిక తొందర పడుతుందా?

Update: 2021-09-10 10:30 GMT
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకు పోతుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఈమె వరుసగా హిందీలో మరియు కన్నడం ఇంకా తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో పెద్ద హీరోల సినిమాలే నాలుగు అయిదు ఉన్నాయి. చిన్న సినిమాలు మరో అయిదు ఆరు ఉన్నాయి. మొత్తంగా ఈమె అరడజను సినిమాలు చేస్తోంది అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆ సినిమాలు కాకుండా కొత్తగా వచ్చే ఏడాదిలో నటించడం కోసం కొన్ని సినిమాలను కూడా ఈమె కమిట్‌ అవుతోంది. తెలుగు లో ఈమె తాజాగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

జీఏ 2 బ్యానర్ లో నటుడిగా పరిచయం అయ్యి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. అందులో రష్మిక మందన్నా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్‌ రవీంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. రష్మిక ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ చాలా కొత్తగా ఉంటుందని మెగా కాంపౌండ్ వారు అంటున్నారు. అల్లు అరవింద్‌ సామాన్యంగా వెంటనే కథలకు ఓకే చెప్పరు. కాని రాహుల్‌ రవీంద్ర చెప్పిన ఈ లేడీ సెంట్రిక్ కథ విషయంలో వెంటనే ఓకే చెప్పారట. కాస్త కమర్షియల్‌ హంగులతో సినిమాను రూపొందించేందుకు బన్నీ వాసును పురమాయించారు అనేది టాక్‌.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను అతి త్వరలోనే పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. రష్మిక కూడా ఈ ప్రాజెక్ట్‌ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ప్రస్తుతం టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌ ల్లో కమర్షియల్‌ హీరోయిన్ గా టాప్‌ లెవల్‌ లో ఉన్న రష్మిక అనూహ్యంగా ఇలా లేడీ ఓరియంటెడ్‌ మూవీకి ఓకే చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్లు తగ్గిన సమయంలో సీనియర్ హీరోయిన్స్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అంటూ రెడీ అవుతారు. కాని ఇప్పుడే రష్మిక హీరోయిన్‌ ప్రత్యేక సినిమాలను చేసేందుకు ఓకే చెప్పడం కాస్త విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రష్మిక ఈ విషయంలో తొందర పడుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. ఒక జోనర్‌.. ఒకే తరహా సినిమాలు అని గిరి గీచుకుని ఉండకుండా అన్ని తరహాల సినిమాలు చేయాలనుకోవడం ఛాలెంజ్ తో కూడిన విషయం. ఆ ఛాలెంజ్ ను ముద్దుగుమ్మ రష్మిక మందన్న స్వీకరించడం మంచి పరిణామం అంటూ ఆమె అభిమానులు అంటున్నారు. ముందు ముందు రష్మిక నుండి మరిన్ని మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తాయని ఆశిస్తున్నామని అభిమానులు చెబుతున్నారు.




Tags:    

Similar News