ఆమె గేమ్‌ ప్లాన్‌ చెప్పిన రవి

Update: 2021-10-09 09:31 GMT
యాంకర్‌ రవి భారీ అంచనాల నడుమ తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టాడు. అనుకున్నట్లుగానే అతడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్‌ లో అతడు ఎంటర్‌ టైన్ చేయడంతో పాటు అంతా సాఫీగా జరగడం కొసం కొందరిని కొన్ని విషయాల్లో ప్రేరేపించినట్లుగా మాట్లాడటం లేదా కొన్ని విషయాలను వారిపై రుద్దినట్లుగా మాట్లాడటం చేస్తున్నాడు అంటూ స్వయంగా ఇంటి సభ్యులు గత కొన్ని రోజులుగా వాదిస్తూ వస్తున్నారను. ఈ విషయం ను షన్ను మొదటి నుండి చెబుతూ వస్తున్నాడు. ఆయన నన్ను ఇన్ఫులెన్స్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు... నేను కూడా ఇన్ఫ్యూలెన్స్ అవుతున్నాను అంటూ పదే పదే వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మొత్తానికి యాంకర్‌ రవిపై ప్రేక్షకుల్లో కూడా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్న ఫీలింగ్ ఉంది. ఇక తాజాగా ఆయన కాజల్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన కాజల్‌ ఆటను విశ్లేషిస్తూ ఆమె చాలా తెలివిగా గేమ్‌ ఆడుతోంది. తన గేమ్‌ తాను ఆడుకోవడమే కాకుండా ఇతరుల గేమ్‌ ను కూడా ఆమె ఆడేందుకు తెలివిగా ప్రయత్నిస్తూనే అందరి అటెన్షన్ ను అలాగే బిగ్ బాస్ అటెన్షన్ ను ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అన్నట్లుగా రవి అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాజల్‌ ఒక గ్రూప్‌ కు పరిమితం కాకుండా.. అందరితో సమ దూరంను పాటిస్తూ ఎలిమినేషన్ లో లేకుండా జాగ్రత్త పడుతుంది అన్నట్లుగా రవి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కాజల్‌ చాలా తెలివిగా గేమ్ ఆడటంతో పాటు అందరిని కూడా సమానంగా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రవి అన్నాడు. ఇటీవల గేమ్ లో రవి మరియు కాజల్‌ లు సీరియస్ అయ్యారు. ఒకరిపై ఒకరు కాస్త సీరియస్ గా వ్యాఖ్యలు చేసుకున్నారు. తాజాగా వరస్ట్‌ ఫర్ఫార్మర్‌ గా కూడా ఆమెను చాలా మంది వేశారు. అదే సమయంలో రవి కూడా ఆమెను వరస్ట్‌ గా వేసి నీకు నాకు ఇక స్నేహం లేదు అనేశాడు. ఇద్దరి మద్య ఒక మంచి స్నేహం ఆరంభంలో ఉండేది. కాని ఇప్పుడు ఆ స్నేహం పూర్తిగా లేకుండా పోయిందని చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం అవుతోంది. కాజల్‌ మరియు రవిల మద్య సీరియస్‌ ఫైట్ జరిగిన సమయంలో ఖచ్చితంగా బయట కాజల్‌ కే ఎక్కువ డ్యామేజీ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆమెకు ఆ విషయం తెలుసు కనుక వెంటనే నష్ట నివారణ చేపట్టే అవకాశం ఉంది.



Tags:    

Similar News