మాస్ రాజా భలే డీల్ కొట్టేశాడే

Update: 2018-02-17 13:26 GMT
ఇప్పుడు చాలా సినిమాలకు గిరాకీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా బాహుబలి సినిమా పెద్ద హిట్టయిన తరువాత.. హిందీలో మన డబ్బింగ్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే మన దగ్గర ఏదన్నా మాస్ సినిమా వస్తోందంటే.. ఆ సినిమా హీరోకు ప్రస్తుతం హిట్లు ఎలా ఉన్నా కూడా.. ఆటోమ్యాటిక్ గా డిమాండ్ పెరిగిపోతోంది. అదిగో ఇప్పుడు రవితేజ కొత్త సినిమాను ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం అర్ధమవుతోంది.

టచ్ చేసి చూడు సినిమా రిజల్టుతో సంబంధం లేకుండా.. ఇప్పుడు మాస్ రాజా కొత్త సినిమాకు ఒక భారీ ఆఫర్ ఇచ్చారట సన్ టీవి వారు. అదేంటంటే.. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్‌ కృష్ణ డైరక్షన్లో రూపొందుతున్న కొత్త సినిమా శాటిలైట్ రైట్స్..అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కు గాను ఇప్పుడు 25 కోట్లు ఆఫర్ చేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా బెస్ట్ డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తరువాత ఏమాత్రం తేడాపడినా కూడా సదరు సినిమాకు కోటి రూపాయలు కూడా రావు. అందుకే వెంటనే నిర్మాతలు ఈ రేటుకు ఎస్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే ఎప్పటినుండో మాస్ రాజాతో సినిమాను తీయాలని ఉవ్విళ్లూరుతున్న రామ్ తాళ్ళూరి అనే నయా ప్రొడ్యూసర్ తో ఈ సినిమాను చేస్తున్నాడు రవితేజ. కొత్తపిల్ల మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు రవితేజతో చేసిన హీరోయిన్స్ అందరిలోకి ఈ 19 ఏళ్ళ చిన్నదే అత్యంత చిన్నది అని చెప్పాలి. అది సంగతి.
Tags:    

Similar News