మాస్ రాజా రవితేజ-శ్రుతిహాసన్ -గోపీచంద్ మలినేని .. ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతున్న సంగతి తెలిసిందే. బలుపు తర్వాత `క్రాక్` కోసం జత కలిసారు. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అతడి ప్రేయసిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికి 60శాతం చిత్రీకరణ ముగించారు. బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఏపీలో జరిగిన ఒక వస్తవ కథను తీసుకొని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్న క్రైమ్ డ్రామా చిత్రమిది. తదుపరి షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాగుతోంది. రవితేజ పై కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా నటిస్తోందన్న సమాచారం ఉంది.
ఈ షెడ్యూల్ అనంతరం విదేశీ షెడ్యూల్స్ కి క్రాక్ బృందం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 4నుండి జర్మనీలో పలు అందమైన లొకేషన్లలో రెండు పాటల్నీ చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ సారథిలో వేసిన భారీ సెట్ లో మరో మాస్ పాటను చిత్రీకరించనున్నారు. అయితే క్రాక్ విదేశీ షెడ్యూల్ కి కరోనా బ్రేక్ వేస్తోందా? అన్న ఆందోళన చిత్రబృందంలో నెలకొందిట.