మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ హీరో అవుతున్నాడా? ఇదే ప్రశ్న శ్రీను వైట్లను అడిగితే .. అలాంటిదేం లేదని సమాధానమిచ్చారు. రవితేజ కొడుకు మహాధన్ నటనకు సిద్ధంగా ఉన్నా.. అతడు ఇంకా చదువుకుంటున్నాడని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వాస్తవానికి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో మహాధన్ నటించాల్సింది. కానీ అమెరికా వర్క్ పర్మిట్ సమస్య రావడంతో అతడు తప్పుకోవాల్సి వచ్చింది. అమెరికాలో ఉండే లయ - తన వారసురాలు ఈ చిత్రంలో మామ్ - డాటర్స్ పాత్రలో నటించారని చెప్పాడు వైట్ల. ఇక రవితేజ వారసుడిగా మహాధన్ నటించాల్సి ఉన్నా కుదరలేదని తెలిపాడు.
ఇక ఇదే విషయంపై నేడు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో మాస్ మహారాజా రవితేజనే ప్రశ్నిస్తే సర్ ప్రైజింగ్ ఆన్సర్ ఇచ్చారు. మహాధన్ నటించాల్సిందే.. కానీ కుదరలేదు. అమెరికా పర్మిట్ల సమస్య.. అలానే వాడి చదువుల బిజీ వల్ల డెబ్యూ ఇవ్వడం కదరలేదని తెలిపారు.
ఇంతకీ మహాధన్ హీరో అవుతాడా.. అవ్వడా? అని రెట్టించి ప్రశ్నిస్తే.. ఛఛ ఇప్పుడే అవ్వడు. వాడి వయసు ఇంకా 11 మాత్రమే. చాలా చిన్న కుర్రోడు.. దానికింకా చాలా టైమ్ ఉందని అన్నారు రవితేజ. 48 గంటల్లో అమర్ అక్బర్ ఆంటోని రిజల్ట్ కోసం ఆత్రంగా వేచి చూస్తున్నానని - రిజల్ట్ తేలే రోజొచ్చిందని రాజా అన్నారు. రిజల్ట్ గురించి టెన్షన్ లేదా? అంటే అబ్బే అలాంటిది ఎప్పుడూ ఉండదనేశారు.