రవితేజ అక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు

Update: 2017-03-20 15:45 GMT
ఏడాదికి పైగా ఒక్క సినిమా కూడా చేయకుండా లాంగ్ బ్రేక్ ఇచ్చిన రవితేజ. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను లాంఛ్ చేసేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేడ్.. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు చిత్రాలను అనౌన్స్ చేసిన రవితేజ.. రాజా ది గ్రేట్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు.

ఇప్పుడు సమ్మర్ కావడంతో సాధారణ ప్రాంతాల్లో షూటింగ్ సాగడం అంటే క్లిష్టమైన అంశం. అందుకే.. ఏప్రిల్ లో రాజా ది గ్రేట్ మూవీ షూటింగ్ కి మాంచి హిల్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుని జంప్ అవుతున్నాడు రవితేజ. వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ లో అనిల్ రావిపూడితో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడట రవితేజ. ఇక్కడ దాదాపు ఓ నెల రోజులకు పైగా షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభంలో డార్జిలింగ్ వెళ్లి.. మే నెల సగం వరకూ అక్కడే ఉండనున్నారట మాస్ మహరాజ్ అండ్ టీం.

ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ పీర్జాడా లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. హీరోను  పూర్తిగా అంధుడి పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఇచ్చిన ప్రీ లుక్ కి మంచి రెస్పాన్సే వచ్చింది. హీరో గుడ్డివాడి కేరక్టర్ అయినా.. కమర్షియల్ అంశాలు ఈ సినిమాల్లో ఫుల్లుగా ఉంటాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News