మాస్ రాజా రవితేజ తన సినిమాలను చాలా లేటుగా దించుతున్నాడని వేరే చెప్పక్కర్లేదు. కొందరు రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ అంటారు.. కొందరు కథలు సెట్టవ్వక అంటారు.. కాని రవితేజ మాత్రం చాలా గ్యాపిచ్చి రాజా ది గ్రేట్ సినిమాతో వచ్చాడు. అలాగే ఇప్పుడు టచ్ చేసి చూడు అంటూ జనవరి చివర్లో ఒక సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు.. మరో కొత్త సినిమాను రెడీ చేస్తున్నాడు.
మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు.. రవితేజ ఇప్పుడు 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొన్నటివరకు ఆపేశారనే రూమర్లు వచ్చాయి కాని.. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెట్టవ్వడంతో తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టయినర్ తరహాలోనే తెరకెక్కిస్తున్నారట. సినిమాలో మాస్ అంశాలన్నీ పుష్కలంగా ఉండటంతో.. సినిమాకు ఏకంగా 'నేల టిక్కెట్' అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ మధ్యన చాలా ఊళ్ళలో ధియేటర్లన్నింటినీ రీ-ఫర్నిషింగ్ చేసి.. అన్నింటినీ మల్టీప్లెక్స్ తరహాలో మార్చేస్తున్నారు. కింద నుండి పైవరకు ఎక్కడ కూర్చున్నా కూడా మినిమం అదే 150 రూపాయలు టిక్కెట్. అందుకే ఇప్పుడు నేల టిక్కెట్ అనే టైటిల్ కు ఎంతమంది కనక్ట్ అవుతారో చూడాలి.