మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇప్పుడు మినిమం సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మద్య కాలంలో చాలా చాలా ఫ్లాప్ లు రవితేజ ఖాతాలో పడ్డాడు. మద్యలో ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న రవితేజ ఆ తర్వాత ‘టచ్ చేసి చూడు’ మరియు ‘నేల టికెట్’ - ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలతో మళ్లీ హ్యాట్రిక్ కొట్టాడు. ఇలాంటి సమయంలో రవితేజ తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు ఒణికి పోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం విడుదలకు ముందు నుండి కూడా రవితేజ, విఐ ఆనంద్ ల కాంబినేషన్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. నవంబర్ లేదా డిసెంబర్ లోనే సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కాని వరుస ఫ్లాఫ లతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోవద్దని రవితేజ భావిస్తున్నాడు. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు మంచి స్క్రిప్ట్ తో సినిమాను మొదలు పెడదాం అంటున్నాడట. తన సన్నిహితులైన దర్శకులకు మరియు నిర్మాతలకు స్క్రిప్ట్ వినిపించడంతో పాటు - వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నాడట.
స్క్రిప్ట్ కు పలు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్న దర్శకుడు విఐ ఆనంద్ సినిమాను వచ్చే నెల లేదా ఫిబ్రవరిలో పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంకు ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక చేయాలని బావిస్తున్నారు. హీరోయిన్స్ విషయంలో పలు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.