మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అంతకంతకు వేడి పెంచేస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్ చిత్రంతో కంబ్యాక్ అయిన రాజా ఎక్కడా తగ్గడం లేదు. సీసీ పవర్ .. హార్స్ పవర్ పెంచేస్తున్నాడే కానీ ఎక్కడా లో ప్రొఫైల్ అన్నదే లేదు. ప్రస్తుతం అతడు నటించిన ఖిలాడీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణ సాగుతోంది. ధమాకా.. స్టూవర్డ్ పురం అంటూ ఒకటే అగ్గి రాజేస్తున్నాడు. నాలుగు సినిమాలు క్యూలో ఉండగానే ఇప్పుడు ఐదో సినిమాని కూడా ప్రకటించేశాడు.
రావణాసుర అనేది టైటిల్. హీరోస్ నాట్ ఎగ్జిస్ట్ అంటూ అద్భుతమైన క్యాప్షన్ తో హీటెక్కించేస్తున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్- ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మాత. 14 జనవరి ఉదయం 9.50 గం.లకు హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో లంఛనంగా సినిమా ప్రారంభం కానుంది. ఆ మేరకు పోస్టర్లతో ప్రకటన వెలువడింది. పదితలల రావణాసురుడిగా రవితేజ లుక్ ని రివీల్ చేయగా క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక సూటు బూటు వేసిన రావణాసురుడు చేతిలో బలమైన సుత్తితో రక్తపు చారలతో కనిపించాడు. అంటే ఇది మాస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సుధీర్ వర్మ మరో ప్రయోగాత్మక చిత్రంతో ఆడియెన్ ని అలరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఖిలాడీ రిలీజ్ తేదీపై క్లారిటీ
ప్రస్తుతం ఖిలాడీ చివరి పాట షూటింగ్ జరుగుతుంది. ఈ పాట మినహా టాకీ పార్ట్ ..ప్యాచ్ వర్క్ కూడా పూర్తయింది. మరోవైపు నిర్మాణనంతర పనులు జరుగుతున్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు రివీల్ చేసారు. అన్ని పనులు పూర్తిచేసి సినిమాని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి నటించి ఆచార్య కూడా రిలీజ్ అవుతుంది. అయితే వారం గ్యాప్ లో ఈ రెండు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఖిలాడీలో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరి..డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇంకా అర్జున్ సర్జా..ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెన్ మూవీస్- ఏస్టూడియోస్ పతాకాలపై కొనేరు సత్యన్నారాయణ.. రమేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
`ఖిలాడీ`నే గాక మాస్ రాజా మరో రెండు చిత్రాల షూటింగ్ లతోనూ బిజీగా ఉన్న సంతి తెలిసిందే. `రామారావు ఆన్ డ్యూటీ`..`ధమాకా` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. రామారావు చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. `ధమాకా` చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు కూడా పక్కా కమర్శియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలే. వరుస హిట్లతో తిరిగి ఫామ్ ని కొనసాగించాలని రాజా పట్టుదలతో ఉన్నారు.