మాస్ రాజా రవితేజ సాధారణంగా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఎప్పుడు చూసినా సినిమానే శ్వాసగా చాలా విషయాలు చెబుతుంటాడు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం.. మన మాస్ రాజా సామాజిక అంశాలపై కూడా ఎక్కువగా స్పందిస్తున్నాడు. అదిగో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అసలు పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంపై కాసినన్ని మంచి మాటలు కూడా చెప్పేశాడు.
''నిజానికి మనం పిల్లలను చిన్నప్పటినుండీ సరిగ్గా పెంచాలి. వాళ్ళకి ప్రస్తుత ప్రపంచ పరిస్థితిపై అవగాహన కల్పిస్తూ.. అందరినీ సమానంగా చూడటం అలవాటు చేయాలి. అలాగే మనం కూడా ఆడపిల్లైనా మగ పిల్లాడైనా కూడా సమానంగానే చూడాలి. అప్పుడే వారు రేపటి పౌరులుగా సరైన దారిలో వెళతారు'' అంటూ చెప్పుకొచ్చాడు మాస్ రాజా. ''మన ఇళ్లలో మనం పిల్లలను ఈ విధంగా పెంచినప్పుడే వారు కూడా బయట సరైన రీతిలో ప్రవర్తిస్తారు. నేను నా పిల్లలిద్దరినీ సమానంగా చూస్తాను. ఇద్దరికీ అన్నింటిలో ఈక్వల్ షేర్ ఇస్తాను'' అంటూ ముగించాడు.
హీరో రవితేజకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి మనోడు చెప్పింది అక్షరాలా సత్యం. అందరూ అలా తమ పిల్లలను.. లింగ వివక్షలేకుండా సమానంగా చూసినప్పుడే.. ఈ సమాజంలో జెండర్ ఈక్వాలిటీ అనేది సమతూల్యంతో ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/