మాస్ మహరాజ్ ఫారిన్ టూర్ ఎందుకో

Update: 2016-07-19 11:30 GMT
మాస్ మహరాజ్ రవితేజ గత ఎనిమిది నెలలుగా ఏ సినిమాని ప్రారంభించలేదు. ఎవరైనా ఫ్లాప్ వస్తే గ్యాప్ తీసుకుంటారు.. కానీ బెంగాల్ టైగర్ లాంటి హిట్ మూవీ తర్వాత రవితేజ బ్రేక్ తీసుకోవడం విచిత్రంగా ఉంది. డిసెంబర్ ప్రారంభంలో బెంగాల్ టైగర్ విడుదలైతే.. ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించలేదు రవితేజ.

ఇప్పుడు హఠాత్తుగా ఈ మాస్ రాజా ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని రిసార్టుల్లో ఎంజాయ్ చేయడంతో పాటు.. ఫేస్ లో గ్లో పెరిగేలా రెజువనేషన్ థెరపీలు కూడా తీసుకోబోతున్నాడని సమాచారం. అక్కడ ఫారిన్ టూర్లలో రవితేజ ఎలా ఎంజాయ్ చేస్తాడో కానీ.. ఇక్కడ మాస్ మహరాజ్ తో సినిమా తీసేందుకు చాలామంది నిర్మాతలే రెడీగా ఉన్నారు. డీవీవీ దానయ్య సహా చాలామంది ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నా.. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ మెట్టు దిగకపోవడంతోనే ఈ పరిస్థితి అని తెలుస్తోంది.

రవితేజతో సినిమా తీసేందుకు 25-30 కోట్ల ఖర్చవుతుందని ఓ అంచనా. మూవీ సక్సెస్ సాధిస్తే ఈ 30 కోట్లను వెనక్కు రాబట్టడం పెద్ద కష్టం కాదు. కానీ రిజల్ట్ తేడా కొడితేనే సమస్య వస్తోంది. అందుకే పారితోషికం విషయంలో కొంత తగ్గాలని రవితేజను చాలామంది నిర్మాతలు అడుగుతున్నా.. మాస్ మహరాజ్ మాత్రం ససేమిరా అంటున్నాడని టాక్. ఇప్పుడు ఫారిన్ టూర్ నుంచి వచ్చాక రవితేజ ఏ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News