మాస్ రాజా ఈ స్పీడేంది బాస్?

Update: 2022-09-11 06:14 GMT
మాస్ రాజా ర‌వితేజ లో జెట్ స్పీడ్ క‌నిపిస్తూనే ఉంది. ఓవైపు  బ్యాక్ టూ బ్యాక్ ప‌రాజ‌యాలు ఎదురైనా సినిమాల జోరు మాత్రం త‌గ్గ‌లేదు. ఈ విష‌యంలోనే త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తోన్న మూడు..నాలుగు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ధ‌మాకా..రావ‌ణాసూర‌..టైగ‌ర్ నాగేశ్వ‌ర‌ర్ షూటింగ్  ద‌శ‌లో ఉన్నాయి.

వాటి ప‌నుల్ని వీలైనంత త్వ‌రగా  పూర్తిచేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నారు. ఇలా ఎంత బిజీగా ఉన్న రాజా కొత్త క‌మిట్ మెంట్ల జోరు మాత్రం తగ్గలేదు. దొరికిన స‌మ‌యంలో క‌థ‌లు వింటూ న‌చ్చిన స్ర్కిప్ట్ ల్ని లాక్ చేస్తున్నారు. ఇటీవ‌లే యంగ్ మేక‌ర్ కం సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్  ఘ‌ట్ట‌మ‌నేని చెప్పిన క‌థ‌కి ఒకే చెప్పారు.

ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాల షూటింగ్  పూర్తిచేసి ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మ‌రో కొత్త సినిమాకి సంత‌కం చేసిన‌ట్లు తెలుస్తోంది.  క‌మ‌ర్శియ‌ల్  డైరెక్ట‌ర్ సంప‌త్ నంది క‌థ‌కి రాజా లాక్ అయిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే సంప‌త్ ర‌వితేజ‌ని క‌లిసి క‌థ వినిపించార‌టు. స్టోరీ న‌చ్చ‌డంతో రాజా మ‌రో ఆలోచ‌న లేకుండా వెంట‌నే ఒకే చెప్పిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా  తెలిసింది.

ఇది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అని అంటున్నారు. అయితే ర‌వితేజ పాత్ర మాత్రం డిఫ‌రెంట్ గా ఉంటుందిట‌.ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో గ‌తంలో బెంగాల్ టైగ‌ర్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా  ఆడింది. ఇందులో సంపత్ ఎలివేష‌న్ కి త‌గ్గ హీరోగా ర‌వితేజ ఆద్యంతం మెప్పించారు. ఈ నేప‌థ్యంలో కాంబో పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం ఇద్ద‌రు ప్లాప్ ల్లోనే ఉన్నారు. కొంత కాలంగా ఈ ద్వ‌యానికి స‌రైన స‌క్సెస్ లేదు. ఇద్ద‌రు విజ‌యం క ఓసం భ‌గీర‌ధ ప్ర‌య‌త్నం చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. మ‌రి అలాంటి స‌మ‌యంలో ఈ ద్వ‌యం చేతులు క‌లుపుతుంది. మ‌రి కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కూ వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని  సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా షూటింగ్ రావ‌ణాసూర పూర్తికాగానే ప్రారంభం  అవుతుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  ఇక్క‌డే ఓ డౌట్ సైతం రెయిజ్ అవుతోంది.  కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని తెర‌కెక్కించ‌నున్న ఈగిల్ కూడా రావ‌ణాసూర పూర్త‌యిన త‌ర్వాత లాంచ్ అవుతుంద‌ని  ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో  రాజా ముందుగా ఏ ద‌ర్శ‌కుడి చిత్రాన్ని ప్రారంభిస్తారు అన్న స‌స్పెన్స్ నెల‌కొంది. వీటిపై క్లారిటీ రావాలంటే రాజా  నోరు విప్పాల్సిందే.
Tags:    

Similar News