ఓటీటీ సంస్థలకు ఆర్బీఐ షాక్.. వినియోగదారులకు ఊరట

Update: 2021-09-11 07:30 GMT
కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం కలిగింది. కానీ ఓటీటీలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. ప్రేక్షకులు ఓటీటీ వైపు వెళ్లడానికి కరోనా కారణమైంది. ఇంట్లోనే మొబైల్, టీవీల్లో సినిమాలు చూసేందుకు వీలుండడంతో వీక్షకాదరణ పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీలకు సబ్ స్క్రైబర్లుగా మారిపోతున్నారు. అయితే ఈ సంస్థలు తమ వినియోగదారుల నుంచి గడువు తేదీ ముగియగానే రెన్యూవల్ కోసం ఆటోమెటిక్ గా ఖాతాదారుల నుంచి డబ్బులు కట్ చేస్తున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇలా కట్ చేయడానికి ఇక అవకాశమివ్వమని తేల్చేసింది.

ఆర్ బీఐ తాజాగా కొత్త రూల్ తీసుకొచ్చింది. అదే అడిషినల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(AFA). ఈ రూల్ ద్వారా వినియోగదారుని ప్రమేయం లేకుండా నెలనెల ఆటోమెటిక్ గా డబ్బులు కట్ అవ్వదు. కచ్చితమైన ధ్రువీకరణను ఖాతాదారుని నుంచి తీసుకున్నాకే డబ్బులు కట్ చేయాలి.  సాధారణంగా అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు తమ ఖాతాదారుల నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే.. రెన్యూవల్ కోసం వారి నుంచి ఆటోమెటిక్ గా డబ్బులు కట్ చేస్తున్నాయి. ముందుగా డబ్బులు కట్ అయి ప్యాకేజీ రెన్యూవల్ అవుతుంది. అయితే AFA ప్రకారం ఇక నుంచి అలా కుదరదు.

కొంత మంది  ఖాతాదారులు ఈ పరిణామాలపై ఆందోళన చెందారు. తమకు రెన్యూవల్ అవసరం లేకున్నా తమ ఖాతా నుంచి డబ్బులు కట్ అవడంతో నిరాశ చెందారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అలాగే బ్యాంక్ ఖాతాదారుల శ్రేయస్సుకు అనుగుణంగా హ్యాకింగ్, ఆన్ లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దొంగతనాలను నివారించేందుకు AFA నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన డెబిట్, క్రెడిట్ కార్డులకు కూడా వర్తించనున్నట్లు తెలిపింది. ఈ విధానం ద్వారా ఖాతాదారులు చెల్లింపులకు భద్రత ఉంటుందని పేర్కొంది.

ఇప్పటి వరకు ఖాతాదారులు ఆన్ మోసాలను అనేకంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఫేక్ మెసేజ్ లు పంపించి వాటిని క్లిక్ చేయమని కోరారు. కొందరు అలా క్లిక్ చేసి చాలా నగదును పోగొట్టుకున్నారు. అయితే ఆటోమెటిక్ పేమెంట్ ఉండడం ద్వారానే ఈ మోసానికి ఆస్కారం ఉందని రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. దీంతో ఆటోమెటిక్ పేమెంట్ విధానాన్ని రద్దు చేసి ఖాతాదారుడు సరైన విధంగా ధ్రువీకరించిన తరువాతు పేమెంట్ ఆప్షన్ పెట్టనున్నారు. ఈ సమయంలో ఖాతాదారులు ఫలానా సంస్థకు డబ్బులు చెల్లించాలా..? వద్దా..? అనేది నిర్ణయించుకుంటారు.ఆ  తరువాతే పేమెంట్ చేస్తాడు.

అడిషినల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ పద్ధతిని ఎలా ఉపయోగించాలో ఆర్బీఐ వివరించింది. మొదటి ట్రాన్జాక్షన్, ఫ్రీ ట్రాన్జాక్షన్, విత్ డ్రా కోసం, రిజిస్ట్రేషన్ సమయంలో  AFA తప్పని సరిగా తెలిపింది. అక్టోబర్ 1 తరువాత ఈ రూల్ అమల్లోకి వస్తుంది. ఆ తరువాత ఆర్బీఐ పరిధిలోకి వచ్చే బ్యాంకులు తమ ఖాతాదారులకు సూచనలు చేస్తాయి. ప్రస్తుతం మాత్రం ఓటీటీ విషయంలో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నాయి. ఆ తరువాతే మిగతా అంశాల్లోకి దీనిని తీసుకొచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అంటే ఇక నుంచి ఓటీటీని వాడేవారు తమ సంబంధిత సంస్థకు పేమెంట్ ను   AFA ద్వారా చేస్తారన్నమాట. మరి ఈ విధానంపై ఓటీటీ సంస్థలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.
Tags:    

Similar News