RRR నుంచి డైజీ స్కిప్ కార‌ణం?

Update: 2019-04-06 03:55 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి RRR ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టించింది మొద‌లు ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ - తార‌క్ స‌ర‌స‌న న‌టించే  క‌థానాయిక‌లు ఎవ‌రు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపించినా వాళ్ల‌లో ఎవ‌రూ క‌న్ఫామ్ కాలేదు. ఆ క్ర‌మంలోనే పాత్ర‌ల్ని - పాత్ర‌ధారుల్ని ప‌రిచ‌యం చేస్తూ రాజ‌మౌళి టీమ్ అధికారికంగా క‌థానాయిక‌ల్ని ప్ర‌క‌టించింది. బాలీవుడ్ రైజింగ్ ట్యాలెంట్ ఆలియాభ‌ట్  రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని - తారక్ స‌ర‌స‌న హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గార్ జోన్స్ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో న‌టించ‌నుంద‌ని ప్ర‌క‌టించారు.

ఆలియా - డైజీ పేర్ల‌ను ఆర్.ఆర్.ఆర్ వేదిక‌పై ప్ర‌క‌టించిన నిమిషాల్లోనే ఆలియా స్పందించింది. ద‌ర్శ‌క‌ధీరుడితో క‌లిసి ఈ చిత్రంలో భాగం కావ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాన‌ని .. ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉంద‌ని ఆలియా ఆనందం వ్య‌క్తం చేసింది. సామాజిక మాధ్య‌మాల్లో త‌న ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది. అయితే డైజీ వైపు నుంచి మాత్రం అస్స‌లు రెస్పాన్స్ అన్న‌దే లేదు. సోష‌ల్ మీడియాలో తాను ఈ ప్రాజెక్టులో న‌టిస్తున్న‌ట్టు క‌నీస మాత్రంగా అయినా మెన్స‌న్ చేయ‌లేదు. డైజీ న‌టిస్తున్న కోల్డ్ ఫీట్ సిరీస్ గురించి - ఇత‌ర‌త్రా అసైన్ మెంట్స్ గురించి ఇన్ స్టాలో వివ‌రాలు ఉన్నాయి కానీ ఆర్.ఆర్.ఆర్ క‌నీస‌ ప్ర‌స్థావ‌న అయినా లేనేలేదు. బ‌హుశా ఈ ప్రాజెక్ట్ క్యాలిబ‌ర్ ఎంతో స‌ద‌రు విదేశీ ముద్దుగుమ్మ‌కు ఎక్క‌లేదా?  లేక అదో లోక‌ల్ సినిమా .. హాలీవుడ్ రేంజు కాదు అని వ‌దిలేసిందా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

మ‌రోవైపు డైజీ ఈ చిత్రంలో న‌టిస్తోంది అన‌గానే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు త‌న‌కు ఫ్యాన్స్ అయిపోయారు. సోష‌ల్ మీడియాలో అప్ప‌టివ‌ర‌కూ కేవలం 5000 ఫ్యాన్స్ మాత్ర‌మే ఉండే డైజీకి 20వేల మంది అభిమానులు పోగ‌య్యారు. కానీ ఏం లాభం డైజీ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నో ఏమో తాజాగా రాజ‌మౌళి టీమ్ డైజీ ఈ చిత్రంలో న‌టించ‌డం లేద‌ని - త‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కాస్తంత సెటైరిక‌ల్ గానే ప్ర‌క‌టించింది. అయితే త‌న‌ని త‌ప్పించ‌డానికి కార‌ణ‌మేంటో మాత్రం స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌లేదు. ఏదైతేనేం స‌ద‌రు టీవీ సిరీస్ ముద్దుగుమ్మ గ్రేట్ ఛాన్స్ మిస్స‌య్యింది. `బాహుబ‌లి` చిత్రంతో అంత‌ర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించిన రాజ‌మౌళి సినిమాలో ఛాన్స్ మిస్స‌యిన ఈ అమ్మ‌డు అందుకు కార‌ణాలేంటో చెబుతుందేమో చూడాలి.
Tags:    

Similar News