టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ బాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరువాత వస్తుండడంతో అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంది. దీంతో ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండాలని ప్రతి సిన్ ను దర్శకుడు ఎలా చేస్తున్నాడు అనే విషయంపై చర్చలు జరుపుతున్నాడట. అటు నిర్మాతలు కూడా ముందే వర్క్ షాప్ నిర్వహించి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారట.
అయితే సినిమా మొదలు పెట్టినప్పుడు 2018లోనే సినిమా రిలీజ్ ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా ఈ ఇయర్ సినిమా రిలీజ్ కావడం లేదని చెబుతోంది. వచ్చే ఏడాది లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ యూవీ క్రియేషన్స్ ఆలోచిస్తోందట. అందుకు కారణం సినిమా అవుట్ ఫుట్ బావుండడం కోసమే అని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ కెరీర్లో వస్తోన్న మరో భారీ బడ్జెట్ సినిమా కావున అంచనాలు చాలా ఉంటాయి.
ఆ స్థాయిలో ప్రేక్షకులకు నచ్చాలంటే హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండాలని చిత్ర యూనిట్ కష్టపడుతోంది. దర్శకుడు సుజిత్ కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడు. కొన్ని సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ వస్తోంది. ఏం చేసినా చిత్రం బావుండాలనే తపనతో చిత్ర బృందం ఆలోచిస్తోందట. అందుకే సాహో రావడం ఆలస్యం అవ్వనుందని సమాచారం.