టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భారీ లాభాలను దక్కించుకుంటున్న దిల్ రాజు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. మీడియాతో సంతోషాన్ని పంచుకోవడంతో పాటు తన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తో ప్రారంభించిన సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. అశోక్ తో మూవీని క్యాన్సిల్ చేసినట్లుగా - ఆ కథతో మరో హీరోను పెట్టి సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు.
గల్లా అశోక్ కోసం మరో కథను సిద్దం చేయిస్తున్నట్లుగా దిల్ రాజు చెప్పలేదు. దాంతో గల్లా సినిమాను దిల్ రాజు వదిలేసినట్లే. దిల్ రాజు ఏ సినిమా చేసినా పక్కా లెక్కలు వేసుకుని చేస్తాడనే విషయం తెల్సిందే. వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మొదట లెక్కలు వేసుకుని, ఆ తర్వాత సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెడతాడు. అయితే గల్లా అశోక్ మూవీ విషయంలో మాత్రం సినిమా ప్రారంభించిన తర్వాత లెక్కలు వేసుకున్నాడేమో వర్కౌట్ కాదని వదిలేసి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దిల్ రాజు నిర్మాతగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించాడు. అందులో ఎక్కువ శాతం సక్సెస్ లు అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా దిల్ రాజుకు నష్టాలను అయితే మిగల్చలేదు. తన ప్రతి సినిమా విషయంలో కూడా క్యాల్యులేటెడ్ గా ఉండటం వల్లే దిల్ రాజు ఇప్పటికి కూడా స్టార్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. కమిట్ అయ్యాం కనుక తీద్దాం - పెద్దొళ్ల సినిమా వదిలేస్తే బాగోదేమో అనే మొహమాటం లేకుండా దిల్ రాజు గల్లా అశోక్ మూవీనికి క్యాన్సిల్ చేసి ఉంటాడని కొందరు భావిస్తున్నారు.