సీరియ‌ల్ న‌టుడి భార్య ఆత్మ‌హ‌త్య‌..ఆమె కార‌ణ‌మ‌ట‌!

Update: 2019-08-08 11:09 GMT
‘కుంకుమ పువ్వు’ సీరియల్ ఫేమ్ మధు ప్రకాష్ వివాదాస్ప‌ద రీతిలో వార్త‌ల్లోకి ఎక్కారు. ఆయ‌న భార్య భారతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలో ఆమె క‌న్నుమూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌ధుప్ర‌కాష్‌ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయం అయినప్పటి నుంచి  తన కూతురును మధు ప్రకాష్‌ నిర్లక్ష్యం చేస్తున్నాడని భారతి తల్లి ఆరోపించారు.

మధుప్రకాష్‌ తో గుంటూరుకు చెందిన భారతికి 2015లో వివాహమైంది. ఆమె ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే గ‌త కొద్దికాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. టీవీ సీరియల్‌ నటి ప్రిన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండ‌టంతో..వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం జ‌రుగుతోంది. మ‌ధు తనను పట్టించుకోవడం లేదని - షూటింగ్‌ ల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడంటూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స‌మాచారం. దీంతో మనస్తాపానికి గురైన భారతి.. మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధ‌మై...భర్తకు వీడియో కాల్‌ చేసిన భారతి తాను చనిపోతున్నాన‌ని ఫ్యాన్‌ కు వేలాడుతున్న చున్నీని చూపించింద‌ని స‌మాచారం. రాత్రి ఇంటికి వ‌చ్చి చూసిన మ‌ధుప్ర‌కాష్‌ కు ఆమె క‌న్నుమూసిన విష‌యం తెలిసింది.

ఇదిలాఉండ‌గా - మ‌ధుప్ర‌కాష్‌ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయం అయినప్పటి నుంచి  మధు ప్రకాష్‌ కు తన కూతురును నిర్లక్ష్యం చేస్తున్నాడని భారతి తల్లి తెలిపారు. ప్రేమ పెళ్లి అయిన‌ప్ప‌టికీ.... రూ.15 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసామని… చివరికి కూతురు చావుకు కారణం అయ్యాడన్నారు. రెండేళ్లుగా భారతిని వేధింపులకు గురి చేస్తున్నాడని…. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగితే సర్థిచెప్పే ప్రయత్నం చేశామని చెప్పారు.కూతురి మృతికి కారణమైన మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మ‌ధు త‌ల్లిదండ్రులు సైతం ఆమెను అవ‌మానాల పాలు చేశార‌ని ఆమె వాపోయారు.

మరోవైపు తన భార్య తనతో ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతుండేదని.. ఆత్మహత్య చేసుకుంటానని చాలా సార్లు బెదిరించిందని మధు చెబుతున్నాడు. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పెద్దగా పట్టించుకోలేదని మధు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

   

Tags:    

Similar News