లేట్ అవుతున్న రేర్ కాంబో

Update: 2018-12-08 14:30 GMT
సినిమాలు లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా ఫలానా రూపంలో వస్తుంది అని ఎవరూ గెస్ చేయలేరు. ఇదే దీనికి ఉదాహరణ. విభిన్నమైన సినిమాల ద్వారా సున్నితమైన ఎమోషన్స్ ని బాగా ఆవిష్కరిస్తారని పేరున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచుకున్నారు. మల్టీ స్టారర్ కథ కావడంతో ఓ హీరోగా నాని ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తనకు అష్టా చెమ్మ రూపంలో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి నాని ఎక్కువ ఆలస్యం చేయలేదు. మరో హీరో గా దుల్కర్ సల్మాన్ కోసం ట్రై చేసిన ఇంద్రగంటి అటువైపు పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. కానీ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు.

అదేంటి అనుకోకండి. అక్కడే ఉంది మతలబు. దుల్కర్ సల్మాన్ కు కథ నచ్చిన మాట వాస్తవం. అయితే వెంటనే సైన్ చేయకపోవడానికి వేరే రీజన్ ఉందట. శంకర్ తీయబోయే భారతీయుడు 2 చాలా కీలకమయిన ఒక యూత్ రోల్ ఉందట. దాని కోసం శంకర్ మనసులో దుల్కర్ సల్మానే ఉన్నట్టు తెలిసిందట. నేరు గా శంకర్ చెప్పక పోయినా ఇతర సోర్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దుల్కర్ ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇంద్రగంటి సినిమా చేస్తున్నందుకు అది వదులుకోవాల్సి వస్తుందనే కారణంతోనే ఇంకొంత టైం అడిగాడట.

మణిరత్నంతో ఓకే బంగారం చేసాడు కాబట్టి శంకర్ తో ఇది ఓకే అయితే కెరీర్ లో మరో మైల్ స్టోన్ యాడ్ అవుతుందనేది దుల్కర్ ఆలోచనగా చెబుతున్నారు సన్నిహితులు.మహానటి వల్ల దుల్కర్ కు ఇక్కడా ఫాన్స్ ఉన్నారు. సో న్యాచురల్ స్టార్ తో దుల్కర్ కనక తోడయ్యి ఇంద్రగంటి స్టైల్ లో ఎంటర్ టైన్మెంట్ ఇస్తే అంత కంటే ఏం కావాలి. అందుకే ఈ రేర్ కాంబో లేట్ అవుతోంది.
Tags:    

Similar News