ప్రభాస్ కు భలే స్కెచ్ వేశారే!

Update: 2018-09-05 07:56 GMT
రేపు పూజ కార్యక్రమంతో మొదలుకానున్న ప్రభాస్ కొత్త సినిమా వార్త విని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇంకా సాహో విడుదల తేదీ ఖరారు కాకుండా ఇదేంటబ్బా అనే డౌట్ అందరిని వెంటాడింది. కొంపదీసి సాహో కన్నా ముందు ఇదే వస్తుందా అనే భయాలు కూడా లేకపోలేదు. అసలు ఇంత గుట్టుచప్పుడు కాకుండా హడావిడి చేయకుండా షూటింగ్ ఎందుకు మొదలుపెడతారా అనే అనుమానం రావడం సహజం. దాని వెనుక వేరే కారణం ఉందని తెలిసింది. సాహో ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరో కీలక పార్ట్ కోసం యుకె వెళ్లాల్సి ఉంది. రేపు స్టార్ట్ కాబోతున్న దర్శకుడు రాధాకృష్ణ మూవీలోని కొంత భాగం కూడా యుకె లోనే షూట్ చేయాల్సి ఉందట. ఎలాగూ ప్రభాస్ అక్కడే ఉంటాడు కాబట్టి అవసరమైన ఆర్టిస్టులను టెక్నీషియన్లను సాహో టీమ్ తో పాటు తీసుకెళ్తే బడ్జెట్ పరంగా కొంత తగ్గుతుంది కాబట్టి ఈ ఆలోచన చేసినట్టు సమాచారం.

ఈ లెక్కన సాహో కంటే రాధాకృష్ణ సినిమా ముందు వచ్చే ఛాన్స్ లేదు. పూజతో మొదలుపెట్టకుండా షూటింగ్ చేయకూడదు కాబట్టి కేవలం యుకె షెడ్యూల్ కోసమే రేపు లాంఛనంగా మొదలు పెడుతున్నట్టు తెలిసింది. దాని తర్వాత ఎలాగూ లాంగ్ బ్రేక్ తప్పదని మరో వార్త కూడా ఉంది. బాహుబలి కోసం నాలుగేళ్లకు పైగా విలువైన కాలన్నీ త్యాగం చేసిన ప్రభాస్ ను వీలైనన్ని సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేయమని అభిమానులు కోరుతున్నారు. కానీ వస్తున్న కథలన్నీ బడ్జెట్ తో పాటు టైంను కూడా అధికంగా డిమాండ్ చేసేవి కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ని  వెయిట్ చేయించక తప్పడం లేదు. యూరోప్ బ్యాక్ డ్రాప్ కీలకంగా ఉండబోతున్న ప్రభాస్ కొత్త సినిమా సాహుతో పాటు వచ్చే ఏడాదే విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఇది కూడా భారీ బడ్జెట్ తో ఉన్నదే కావడంతో అది మాత్రం నమ్మకంగా చెప్పలేం.
Tags:    

Similar News