ఇవాళ 2.ఓ ఆడియో అందుకేనా!!

Update: 2017-10-27 07:28 GMT
సౌతిండియా సూపర్ స్టార్ తో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 2.ఓ. గతేడాది మధ్యలో ప్రారంభమైన ఈ చిత్రం.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాటికి విడుదల కానుంది. ఇంత సుదీర్ఘ కాలం చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి.. ఇవాళే దుబాయ్ లో భారీ ఎత్తున ఆడియో లాంఛ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇంతటి భారీ చిత్రానికి కనీసం వీకెండ్ కాకుండా.. ఏ పండుగ సందర్భమూ లేకుండా ఉండే డేట్ ను ఆడియో లాంఛ్ కు ఎంచుకోవడంలో ఆశ్చర్యం వేయకమానదు. అయితే.. ఇవాళే అంటే అక్టోబర్ 27నే 2.ఓ చిత్రం ఆడియో విడుదల చేయడంలో ఓ విచిత్రమైన టెక్నిక్ ఉందనే విషయంపై ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇవాల్టి తేదీ 27-10-2017. సింపుల్ గా చెప్పుకుంటే సినిమా టైటిల్ అయిన 2.0లోని రెండు అక్షరాలు.. రెండేసి సార్లు వస్తాయి. అలాగే.. 27వ తేదీ 10వ నెలలోని సంఖ్యలను కాస్త అటూ ఇటూ చేస్తే.. 2017 సంవత్సరం అవుతుంది. ఇలాంటి సందర్భాలు మళ్లీ కలిసి వచ్చే అవకాశం దగ్గరలో లేదు.

అందుకే అక్టోబర్ 27నే ఆడియో రిలీజ్ కు డేట్ గా నిర్ణయించారని తెలుస్తోంది. ఇదంతా దర్శకుడి టెక్నిక్.. నిర్మాతల వ్యూహం అంటూ ప్రచారం రకరకాలుగా వినిపిస్తున్నా.. వాళ్ల స్ట్రాటజీ కంటే చాలాసార్లు జనాల చతురతే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇంతకీ శంకర్ ఇదే ఉద్దేశ్యంతోనే ఇవాళే 2.ఓ ఆడియోను లాంఛ్ చేసినట్లు నమ్మేయచ్చా అంటే.. ఎవరిష్టం వారిది అంతే.


Tags:    

Similar News