ఫిదా బ్యూటీ వలన నష్టమే

Update: 2018-01-02 20:30 GMT
2017 లో ఫిదా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి. అమ్మడి అదృష్టం ఏమిటో గాని అలా అడుగు పెట్టిందో లేదో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుతున్నాయి. ఇప్పటికే మలయాళంలో అగ్రతారగా ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. అలాగే కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో జత కట్టేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఎంసీఏ తో కూడా అమ్మడు పర్లేదనే అనిపించుకుంది.

అయితే మొన్నటి వరకు బాగానే ఉన్నా సాయి పల్లవి పై సడన్ గా చేంజ్ అయ్యిందని ఆమె పై చాలా రూమర్స్ వచ్చాయి. టైముకి రాదని అలాగే నిర్మాత హీరోతో కొంచెం గోడవపడిందని టాక్ బాగా వచ్చింది. కోలీవుడ్ లో కూడా ఈ హాట్ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. ఇంతకుముందే దిల్ రాజు సాయి పల్లవిపై వచ్చిన రూమర్స్ ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలలో హల్ చల్ చేస్తున్నాయి.

రీసెంట్ గా నానితో గోడవపడటం వల్లే అమ్మడు ప్రమోషన్స్ కి కూడా రావడం లేదని కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ ఫైనల్ గా మరో సారి చిత్ర యూనిట్ ఆ వార్తలను ఖండించింది. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె రాలేకపోయిందని చిత్ర యూనిట్ ఇప్పుడు చెబుతోంది. ఏదైమైనా కూడా.. అసలు సాయి పల్లవి ఎక్కడా కనిపించకపోవడంతో.. ఎంసిఏ రిలీజ్ తరువాత కలక్షన్లకు కాస్త మైనస్ అయ్యిందనే విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు సాయి పల్లవి గురించి ఎంత కవర్ చేసినా.. లాభం లేదులేండి.
Tags:    

Similar News