సరైనోడు కి సెన్సారోళ్లే కారణమా?

Update: 2016-04-15 06:17 GMT
సరైనోడు చిత్రంలో కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారన్న మాట వాస్తవమే. అయితే, సినిమా మొత్తం కంప్లీట్ చేసేసి, సెన్సార్ కి కూడా కాపీ పంపించాక రీషూట్ చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సూచనలే కారణమని కూడా అన్నారు. అయితే.. అసలు విషయం వేరే ఉంది.

సరైనోడులో యాక్షన్ సీన్స్ హై ఓల్టేజ్ లో ఉంటాయని, టీజర్ - ట్రైలర్ లతో చెప్పేశారు. ఈ సీన్స్ మరీ శృతిమించి ఉండడంతో.. సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిందట సెన్సార్ బోర్డ్. కొన్ని యాక్షన్ సీన్స్ ను ఎడిట్ చేసి, స్థాయి తగ్గిస్తే యూ/ఏ ఇవ్వడానికి అబ్జెక్షన్ లేదని చెప్పారట. వాటిని ఎడిట్ చేస్తే.. యాక్షన్ సీక్వెన్స్ లో కంటిన్యుటీ మిస్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే.. మళ్లీ షూటింగ్ చేయాలని నిర్ణయించారట బన్నీ అండ్ బోయపాటి. అలాగే మల్టీప్లెక్సుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకూడదంటే యూ/ఏ తప్పనిసరి.

అలా సరైనోడు చిత్రం రీషూట్ కి సెన్సార్ సర్టిఫికేట్ కారణం తప్ప... ఔట్ పుట్ సరిగాలేదనో, చిరంజీవి చెప్పారనో కాదు. మరోసారి కూడా సెన్సార్ చేయించేసి, ఏప్రిల్ 22న థియేటర్లలోకి రానున్నాడు సరైనోడు.
Tags:    

Similar News