జగన్‌ వస్తేనే మెగా బాబు సెట్టవుతాడు

Update: 2015-01-21 04:02 GMT
ఇదండీ మెగా సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అసలు తన తొలిసినిమానే పూరి జగన్‌ డైరక్షన్‌లో చేయాలి వరుణ్‌ తేజ్‌. కాని ఆ సినిమాను అనూహ్యంగా, ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీకాంత్‌ అడ్డాలకు ఇచ్చారు. ''ముకుంద''గా మలచి జనాల దగ్గర నుంచోబెట్టాడు అడ్డాల. కాని సినిమాలో అసలు ఒక కొత్త హీరోను ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్‌ చేసేంత సీన్‌ ఆ సినిమాలో లేదు. దానితో వరుణ్‌ తేజ్‌ యాక్టింగ్‌ను అందరూ మెచ్చుకున్నారే కాని, ఒక పెద్ద కమర్షియల్‌ హీరోగా మాత్రం ఇంకా చూడట్లేదు. అందకోసమే ఇప్పుడు పూరి జగన్‌ జపం చేస్తున్నారు మెగా క్యాంప్‌.

వాస్తవానికి పూరి జగన్‌ సినిమా అంటే ఆడుతుందో ఆడదో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుత సిట్యుయేషన్లు ఉన్నాయి. మనోడు ఈ మధ్య కాలంలో బీభత్సమైన బ్లాక్‌బస్టర్‌ ఏదీ తియ్యలేదు. స్టోరీ లేకుండా కేవలం క్యారెక్టరైజేషన్‌తో మాత్రమే ప్రయోగాలు చేస్తున్నాడు. అయినాసరే జగన్‌తోనే సినిమా చేయాలని వరుణ్‌ ఎందుకు అనుకున్నాడు? పూరి సినిమాల్లో స్టోరీ లేకపోయినా కూడా, హీరో క్యారెక్టర్‌ మాత్రం అదరిపోతుంది. ఆ క్యారెక్టర్లకు జనాలు కనెక్ట్‌ అయిపోతారు. దానితో హీరోలు మార్కెట్లో నిలబడిపోతారు. అందుకే ఈ దర్శకుడి క్రేజ్‌ ఇంకా తగ్గట్లేదు. ఇప్పుడున్న పొజిషన్‌లో వరుణ్‌ తేజ్‌ సరిగ్గా సెట్టవ్వాలంటే మరి ఈయన హస్తం పడాల్సిందే!!

Tags:    

Similar News