బాలయ్య 105లో కీలక మార్పులు?

Update: 2019-05-31 04:43 GMT
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ డిజాస్టర్ అయ్యాక బాలకృష్ణ కొత్త సినిమా ఏది చేస్తారు అనే సస్పెన్స్ కు తెరదించుతూ కొద్దిరోజుల క్రితం కెఎస్ రవికుమార్ ప్రాజెక్ట్ కి ఓకే చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి షూటింగ్ ప్రారంభోత్సవం ఈ నెలలోనే జరుగుందని అందరూ అనుకున్నారు. టిడిపి అధికారం కోల్పోయినా తాను హిందూపూర్ లో గెలిచాడు కాబట్టి వియ్యంకుడి ఓటమి తాలుకు మూడ్ పెద్దగా ఉండేదేమో అనుకున్నారు అందరూ.

కాని ఇప్పటిదాకా ఈ 105వ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనికి కారణం వేరొకటి ఉండదని ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం ముందు రాసుకున్న కథలో విలన్ జగపతిబాబు పాత్రను డ్యూయల్ రోల్ గా డిజైన్ చేశారట. ఒకటి తండ్రి మరొకటి కొడుకుగా. ఇద్దరూ విలన్లే. వాళ్ళను ధీటుగా ఎదురుకునే పాత్రలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. టిడిపి గెలుస్తుందనే ధీమాతో ముందు అనుకున్న స్క్రిప్ట్ లో తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఎపిసోడ్లు పధకాలను ప్రస్తావించడం లాంటివి రాసుకున్నారట.

ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో అవి చూపిస్తే కామెంట్స్ వస్తాయనే ఉద్దేశంతో మొత్తం రీ రైట్ చేసే పనిలో పడ్డారట. దీంతో ఇద్దరు జగపతిబాబులు కాస్తా ఒకరే అయ్యారని వినికిది. ఈ కసరత్తుకే లేట్ అవుతోందని అంతా ఓకే అయ్యాక అప్పుడు మొదలుపెడదామని బాలయ్య కెఎస్ కు చెప్పినట్టు తెలిసింది. ఇద్దరు హీరొయిన్లు నటించబోయే సినిమాకు సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరినే టార్గెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది


Tags:    

Similar News