బాలీవుడ్ కి ఒకనాటి బ్యూటీ రేఖ.. ఇప్పటికీ ఫ్యాషన్ విషయంలో తెగ అప్డేటెడ్ గా ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన స్టైలింగ్ ని మెయింటెయిన్ చేయడం ఈమెకు హాబీ. ఒక్కో టైంలో ఒక్కో డ్రెసింగ్ ని ఫాలో అయిపోతూ ఉంటుంది రేఖ. తన స్టైల్ ని మళ్లీ తనే బ్రేక్ చేస్తూ.. కొత్తగా దర్శనం ఇచ్చేస్తుంటుంది.
కాంజీవరం చీరలు.. పెదాలపై ముదురు ఎరుపు రంగులో కొట్టొచ్చినట్లుగా కనిపించే లిప్ స్టిక్.. నుదుటన పెద్దగా కనిపించే సింధూరం బొట్టు.. ఇలాంటివన్నీ రేఖ ఫాలో అయిపోయిన పాత ట్రెండ్స్. వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ.. ఇప్పుడు మోస్ట్ మోడ్రన్ గెటప్ లోకి దిగిపోయింది రేఖ. తాజాగా హృతిక్ రోషన్ మూవీ కాబిల్ ప్రీమియర్ షోను ప్రదర్శిస్తే.. ఆ కార్యక్రమానికి రిప్పెడ్ జీన్స్ లో హాజరై.. అందరికీ షాక్ కొట్టించేసిందీ ముదురు బ్యూటీ. 62 ఏళ్ల వయసులో ఇలా మోకాళ్ల నుంచి పైకి చిరిగిన జీన్స్ వేయడం అంటే మాటలా మరి? స్టైలింగ్ విషయంలో తన కొత్త ఇస్తున్నట్లే.
రిప్పెడ్ బ్లూ జీన్ ప్యాంట్.. బ్లాక్ ఓవర్ కోట్.. బ్లాక్ సన్ గ్లాసెస్.. కొప్పు పెట్టినట్లుగా కనిపిస్తున్న భారీ క్యాప్.. ఇదీ కాబిల్ ప్రీమియర్ లో రేఖ అవతారం. అరవై రెండేళ్ల వయసులోనే ఇలా ఉందంటే.. దశాబ్దాల క్రితం అంతేసి క్రేజ్ ను సంపాదించుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/