ఆ రోజుల్లోనే సుదీర్ఘమైన 5 నిమిషాల లిప్‌లాక్

Update: 2020-03-22 03:30 GMT
కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించిన నటి రేఖ. రేఖ వయస్సు ప్రస్తుతం అరవై ఐదేళ్లు. ఈమె తన నటనకుగాను తన కేరీర్‌లో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఒక బుక్ ద్వారా ఆమె గురించి ప్రపంచానికి ఎన్నో విషయాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. ఇటీవల రేఖ జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని యాసిర్ ఉస్మాన్ అనే రచయిత రాసిన 'రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ' అనే పుస్తకంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏ స్టార్ హీరోయిన్‌కైనా కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాలు తప్పవనేది కాదనలేని వాస్తవం. ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థానానికి ఎదిగిన ఏ హీరోయిన్‌నైనా కదిలిస్తే తాము నడిచి వచ్చింది పూలబాట కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. ఇలా ఎందరో తారామణులు తమ జీవితంలోని చీకటి కోణాలను కొన్నిసార్లు పంచుకొంటారు. తాజాగా ఐదు దశాబ్దాలకుపైగా బాలీవుడ్‌లో రారాణిలా ఎదిగిన రేఖ కెరీర్ జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి.

అంజనా సఫర్ అనే చిత్రం షూటింగ్ జరిగే సమయంలో బిస్వజీత్ అనే హీరోతో కొన్ని రొమాంటిక్ సీన్లు చిత్రీకరించాల్సి వచ్చిందంట. ఆ సమయంలో ఆమెకు చెప్పకుండా ఓ సుదీర్ఘమైన లిప్‌లాక్‌ను తీశారు అనే విషయాన్ని తన పుస్తకంలో పొందుపరిచారు. డైరెక్టర్ రాజా నవాతే యాక్షన్ చెప్పగానే రేఖను బిస్వజీత్ తన కౌగిలిలోకి తీసుకొని దాదాపు 5 నిమిషాల పాటు పెదాలపై పెదాలు పెట్టి చుంబించాడంట. డైరెక్టర్ కట్ చెప్పగానే స్టూడియో మొత్తం ఈలలు చప్పట్లతో మోగుతుండగా 15 ఏళ్ల రేఖ మాత్రం ఏడుస్తూ కూర్చుందట. ఆమె పరిస్థితిని ఎవరూ పట్టించుకోకపోగా, సీన్ బాగా వచ్చిందని ఆనందపడిపోయారట. ఈ సీన్ రేఖకు మాత్రం తన జీవితంలో ఓ చేదు అనుభవంగా మారిందనే విషయాన్ని రచయిత యాసిర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానుల్లో కొందరు రేఖ పరిస్థితి తెలుసుకుని జాలి పడుతుండగా, మరికొందరు మాత్రం ఆ రోజుల్లోనే 5 నిమిషాల లిప్ లాక్ సీన్ ఎలా చిత్రీకరించారబ్బా అంటూ ఆలోచిస్తున్నారట.
Tags:    

Similar News