నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు.. ఎన్టీఆర్ విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్లీ జనతా గ్యారేజ్ కోసం ఇదే సీన్ రిపీట్ అయ్యేట్లుగా కనిపిస్తోంది. యంగ్ టైగర్ రిలీజ్ చేస్తానని చెప్పిన డేట్ కి.. ఇప్పుడు మరిన్ని మూవీస్ క్యూ కట్టేశాయి. జనతా గ్యారేజ్ ప్రారంభించినపుడే ఆగస్ట్ 12 డేట్ ని లాక్ చేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. షూటింగ్ కూడా అనుకున్న మేరకు జరుగుతుండడంతో.. ఆ తేదీని ఖచ్చితంగా విడుదలవుతుందని టాలీవుడ్ జనాలకు అర్ధమైంది. అందుకే తమ సినిమాల రిలీజ్ లను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నే కొన్ని సినిమాలు టెన్షన్ పెడుతున్నాయి.
ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి జూలై 15నుంచి పోస్ట్ పోన్ అయింది. దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని చూస్తుండడం.. జనతా గ్యారేజ్ కు పెద్ద దెబ్బ అనాల్సిందే. తెలుగులో కూడా ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ అవడం ఖాయం. అప్పుడు కలెక్షన్స్ పై విపరీతంగా ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో పాటు హిందీ సినిమాలు హృతిక్ రోషన్ మొహెంజొదారో.. అక్షయ్ కుమార్ రుస్తొం చిత్రాలు కూడా ఆగస్ట్ 12కే విడుదల కానున్నాయి. ఈ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మల్టీప్లెక్సుల విషయంలో చాలానే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక యూఎస్ లో కూడా జనతా గ్యారేజ్ కు ఆశించిన స్థాయిలో స్క్రీన్స్ దొరకడం కష్టమైపోతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా కబాలినే జనతా గ్యారేజ్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఒకవేళ రజినీకాంత్ సినిమా ముందు రిలీజ్ అయిపోతే.. చాలావరకు గ్యారేజ్ కి లైన్ క్లియర్ అవుతుంది. లేకపోతే.. ఎన్టీఆర్ కి మళ్లీ నాన్నకు ప్రేమతో రిలీజ్ టైం ఇబ్బందులు రిపీట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్లే.