తెలుగు రాష్ట్రాల్లో టాప్ యాంకర్లు ఎవరు? అన్నంతనే వరుస పెట్టి పేర్లు చెప్పేస్తుంటారు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ. ఆ జాబితాలో వినిపించే పేర్లు సుమ.. అనసూయ.. రష్మీ.. ప్రదీప్ మాచిరాజు.. రవి.. శ్యామల తదితరులు. మరి.. ఈ టాప్ యాంకర్లకు వసూలు చేసే రెమ్యునరేషన్ల మాటేమిటి? ఒక ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వారెంత ఛార్జ్ చేస్తారన్న ప్రశ్నకు చాలామంది నోటి నుంచి తెలీదన్న సమాధానమే వస్తుంది.
తెలుగునాట నిర్వహించే కార్యక్రమం ఏదైనా సరే.. టాప్ యాంకర్లు ఉండాల్సిందే. లేదంటే ఆ కార్యక్రమానికి కళ లేని పరిస్థితి. టాప్ యాంకర్లుగా రాజ్యమేలుతున్న ఈ ప్రముఖులు వసూలు చేసే పారితోషికాల లెక్క చూస్తే.. యాంకర్లలో టాప్ వన్ స్థానంలో నిలుస్తారు సుమ కనకాల. ఆమె హాజరయ్యే ప్రోగ్రాం ఏదైనా సరే.. రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పారితోషికాన్ని తీసుకుంటారని చెబుతున్నారు.
తర్వాతి స్థానంలో నిలుస్తారు అనసూయ భరద్వాజ. ఆమె యాంకరింగ్ కు ఉన్న గ్రేస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ.. వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు.
ఆమె పాల్గొనే ఒక్కో ప్రాగ్రాంకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని చెబుతున్నారు. ఫిమేల్ యాంకర్ల హవా ఇలా నడుస్తుంటే.. మేల్ యాంకర్ల విషయానికి వస్తే.. ప్రదీప్ మాచిరాజు ముందుంటారు. అతగాడు ఒక్కో ఈవెంట్ కు రూ.2లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటారని చెబుతున్నారు.
నిజానికి మేల్ యాంకర్లతో పోలిస్తే ఫిమేల్ యాంకర్ల హవానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే.. హీరోయిన్లకు తక్కువ ఇస్తారు. యాంకర్లలో మాత్రం ఫిమేల్ యాంకర్లకు ఎక్కువ.. మేల్ యాంకర్లకు తక్కువ పారితోషికం ఇవ్వటం విశేషం. మేల్ యాంకర్లలో ప్రదీప్ తర్వాతి స్థానం రవిదే. అతగాడికి ఒక్కో ఈవెంట్ కు రూ.లక్ష చొప్పున రెమ్యునరేషన్ ఇస్తారు.
రష్మీ విషయానికి వస్తే.. రూ.2-3 లక్షలు.. శ్యామలకు రూ.లక్ష వరకు పారితోషికంగా ఇస్తున్నారు. యాంకరింగ్ తో పాటు ఇంటర్వ్యూలు ఎక్కువగా చేసే మరో యాంకర్ మంజూషకు ఒక్కో ప్రాగాంకు లక్ష చొప్పున పారితోషికం ఇస్తారని చెబుతున్నారు. ఏమైనా.. టాప్ యాంకర్లు ఎవరైనా ప్రోగ్రాంకు లక్ష తక్కువకు వచ్చే పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ పారితోషికం మరింత ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.