పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తెలుగులోకి రీ-ఎంట్రీ ఇస్తుండడం ఇప్పుడొక హాట్ టాపిక్ అయింది. స్టువర్ట్ పురం దొంగల్లో ఫేమస్ అయిన టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో రేణు దేశాయ్ ఒక కీలక పాత్ర పోషిస్తుందని.. టైగర్ నాగేశ్వరరావు అక్క పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది తూచ్.
అంతా తూచ్ కాదు. టైగర్ బయోపిక్ లో రేణు నటించడం మాత్రం పక్కానే. కానీ టైగర్ నాగేశ్వరరావు సోదరి పాత్రలో కాదు. ఆమె స్వర్గీయ హేమలతా లవణం పాత్రలో నటిస్తారట. ఇంతకీ హేమలతా లవణం ఎవరు? ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా గారి కూతురే ఈ హేమలత. అదొక్కటే కాదు.. ఆమె ఒక ప్రముఖ సమాజ సేవకురాలిగా పేరు తెచ్చుకున్నారు. జోగిని సంప్రదాయాన్ని రూపుమాపేందుకు.. అంటరానితనాన్ని పారదోలేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. చంబల్ లోయ లాంటి భయంకర ప్రదేశాల్లోని బందిపోట్లలో పరివర్తన తీసుకొచ్చేందుకు.. వారిని సాధారణ జీవితం గడిపే దిశగా ప్రోత్సహించేందుకు ఆవిడ చాలా కృషి చేశారు. రేణు దేశాయి ఎంత పవర్ఫుల్ పాత్ర పోషిస్తోందో ఇప్పుడు అర్థం అయింది కదా.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకుడు. పవర్ఫుల్ కథాంశం ఎంచుకోవడంతోనే అందరినీ ఆకర్షించిన దర్శకుడు రేణు దేశాయ్ కీలక పాత్రకు ఒప్పించడంతో సినిమాకు మరింతగా హైప్ తీసుకొచ్చాడు. మరి ఇలాంటి కాంప్లెక్స్ స్టొరీని తెరమీదకు ఎలా తీసుకొస్తాడో వేచి చూడాలి.