#కరోనా: ఆర్జీవీ ఇన్ని చీవాట్లు ఇంకెప్పుడూ తిన‌డేమో?

Update: 2020-03-30 05:31 GMT
ట్విట్ట‌ర్ .. ఇన్ స్టాలో ఆర్జీవీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వివాదాల గురుడు రెగ్యుల‌ర్ గా ఏదో ఒక వివాదంతో అక్క‌డ ఫాలోవ‌ర్స్ ని యంగేజ్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌పంచాన్ని చాప చుట్టేస్తూ మ‌ర‌ణ మృదంగం మోగిస్తుంటే.. ఇంట్లో స్వీయ‌నిర్భంధంలో ఉన్న రామూజీ ఏం చేస్తున్నాడో తెలుసా? త‌న‌కు బ‌య‌టి వ్య‌వ‌హారాల‌తో ఏ సంబంధం లేదు అన్న‌ట్టే త‌న ప‌నిలో తాను ఉన్నాడు. రెగ్యుల‌ర్ గా ట్వీట్లు.. ఇన్ స్టా వ్యాఖ్య‌ల‌తో త‌న‌దైన శైలిలో వెట‌కారం ఆడేస్తున్నాడు. రీసెంట్ ట్వీట్లు .. ఇన్ స్టా పోస్టులు ప‌రిశీలిస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మైపోతుంది ఎవ‌రికైనా.

తాజాగా మెగాస్టార్ - నాగార్జున వంటి స్టార్ల‌తో కూడుకున్న ఓ వీడియోని షేర్ చేసిన ఆర్జీవీ దానికి అంతే వెట‌కారంగా వ్యంగ్యంగా వ్యాఖ్య‌ను జోడించారు. ``క‌రోనా వైర‌స్ పై మెగా ఎమోష‌న‌ల్ మ‌ల్టీస్టార‌ర్ సాంగ్ ఇది.. మైండ్ బ్లోవింగ్ ఫెంటాస్టిక్.. బాక్టీరియా ప్ర‌పంచం నుంచి సోర్స్ ఇది.. ఈవెన్ ఈ వీడియోని క‌రోనా కూడా ప్రేమిస్తుంది`` అంటూ త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. అంతేనా.. నాకు నేనుగా ఏప్రిల్ ఫూల్ డే రోజున నాన్ ఎమోష‌నల్ క‌రోనా సాంగ్ ని రిలీజ్ చేస్తాను అని హింట్ ఇచ్చాడు. ఎవ‌రు ఫూల్ నో వైర‌స్ డిసైడ్ చేస్తుంద‌ని వ్యాఖ్యానించాడు ఆర్జీవీ.

ఇక వేరొక ట్వీట్ లో ఆర్జీవీ ఏకంగా మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. ఆయ‌న వార‌సుడు లోకేష్ నాయుడుల‌పై వెట‌కారంగా టీజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ``టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాదు లోని తమ ఇంట్లోనే ఉన్నారు. తండ్రి కుమారుడు ఇద్ద‌రూ ఖాళీగానే ఉన్నారు కాబట్టి అమెజాన్ ప్రైమ్ లో  నేను తీసిన‌ `అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి`` అంటూ వ్యాఖ్యానించారు. వ‌రుస‌గా ఈ త‌ర‌హా ట్వీట్లు ఎన్నో ఆర్జీవీ చేస్తూనే ఉన్నారు. వీటికి అభిమానులు అంతే ఇదిగా కౌంట‌ర్లు వేస్తున్నారు. కొంద‌రైతే నువ్వు తీసిన చెత్త సినిమాల వ‌ల్ల‌నే వైర‌స్ పుట్టుకొస్తుంద‌ని కామెంట్ల‌తో చెల‌రేగారు.

ఇక‌పోతే ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారీ క‌ల్లోలం చూసి చంద్ర‌బాబు .. లోకేష్ సైతం ముఖ్యమంత్రి వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యాక్టివిటీస్ స‌రైన‌వేన‌ని అంగీక‌రించారు. లాక్ డౌన్ స‌హా ప్ర‌తి నిర్ణ‌యం స‌రైన‌వేన‌ని విమ‌ర్శిస్తూ ప్ర‌తిప‌క్ష హోదాలో .. స్థానికంగా కొన్ని ఘ‌ర్ష‌ణ‌ల్ని ఎత్తి చూపుతున్నారు. అయితే అలాంటి వాళ్లు కెలుకుతూ ఆర్జీవీ ఇలాంటి వెట‌కారం ఆడ‌డాన్ని చాలామంది తప్పు ప‌డుతున్నారు. అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న వార‌సుడిని టార్గెట్ చేసి తీసిన‌ది అన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి సినిమాని ఆ ఇద్ద‌రూ చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలా? మ‌రి దీనిపై బాబు.. లోకేష్ స్పందిస్తే ఎలా ఉంటుందో? ఇది వెట‌కార‌మా .. వ్యంగ్య‌మా.. పైత్య‌మా? అంటూ ర‌క‌ ర‌కాల కామెంట్లు సోష‌ల్ మీడియాలో ఆర్జీవీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయ్. ఓవైపు క‌రోనా క‌ల్లోలంలో చిక్కుకున్న సినీకార్మికుల‌కు అంద‌రూ విరాళాలు ప్ర‌క‌టించి నిత్యావ‌స‌రాల సాయం చేస్తుంటే... ఆర్జీవీ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు నా ఇష్టం అన్న‌ట్టుగానే ఉన్నాడు. స్వార్థప‌రుడే అయినా మ‌రీ ఇలా జ‌నం చ‌చ్చే ప‌రిస్థితిలో ఉంటే ఇప్పుడు కూడాడా? అంటూ తీవ్ర విమ‌ర్శ‌లే వెల్లువెత్తుతున్నాయి ఆర్జీవీపై.
Tags:    

Similar News