ఆర్జీవీ కొత్త పోస్టర్ వదిలాడు...!

Update: 2020-07-25 17:55 GMT
కరోనా పరిస్థితుల కారణంగా సినిమాలు తీసేందుకు మేకర్స్ అందరూ ఇబ్బందులు పడుతుంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలు చేసేస్తున్నాడు. సినిమా విడుదల చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదని.. అసలు సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్స్ అవసరం లేదనే రీతిన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే పర్సనల్ యాప్ క్రియేట్ చేసి తన సినిమాలను ప్రేక్షకుల మీదకి వదులుతున్నాడు. ఈ క్రమంలో ముందుగా శృంగార తార మియా మాల్కోవాతో ''క్లైమాక్స్'' అనే సినిమా రిలీజ్ చేసాడు. దీనికి బాగానే లాభాలు రావడంతో వెంటనే తెలుగమ్మాయి శ్రీ రాపాకతో 'నగ్నం' అనే షార్ట్ మూవీ తెరకెక్కించాడు. వీటితో పాటు ఈ రోజు ''పవర్ స్టార్'' అనే సినిమా కూడా రిలీజ్ చేసాడు వర్మ. అంతేకాకుండా అప్సరా రాణి - రాక్ కచ్చి ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ 'థ్రిల్లర్' అనే సినిమా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు వర్మ.

కాగా నేడు 'పవర్ స్టార్' సినిమా మెగా బ్లాస్ట్ అయిన సందర్భంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ కాబోతున్న నెక్స్ట్ సినిమా 'థ్రిల్లర్' ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్ చేసారు. ఈ క్రమంలో లేటెస్టుగా 'థ్రిల్లర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు వర్మ. ఈ పోస్టర్ లో హీరోయిన్ భయపడుతూ రోడ్ మీద ఫోన్ మాట్లాడుతున్నట్లు మూడు యాంగిల్ లో ఆమె కనిపించేలా డిజైన్ చేసారు. ఇక NNN సిరీస్ లో భాగంగా రాబోతున్న ఈ సినిమాని ఏ కంపెనీ ప్రొడక్షన్స్ మరియు సౌత్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'థ్రిల్లర్' సినిమాని శ్రేయాస్ ఈటీ - ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో తెలుగు - హిందీ - తమిళ్ - మలయాళం - కన్నడ - మరాఠీ - భోజపురి - గుజరాతీ - ఒడియా భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News