రామ్ గోపాల్ వర్మ చడీచప్పుడు లేకుండా ‘క్లైమాక్స్’ అనే సినిమా తీసి పారేశాడు. అదెప్పుడు మొదలుపెట్టాడో.. ఎప్పుడు పూర్తి చేశాడో తెలియదు. ఉన్నట్లుండి టీజర్ అన్నాడు. తర్వాత ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశాడు. ఇంతలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు. మే 29న ‘క్లైమాక్స్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఐతే థియేటర్లు మూతపడి ఉన్నాయి కదా.. ఈ నెలలో రిలీజ్ ఏంటి అనే సందేహం కలగొచ్చు. బహుశా ఏదో ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తున్నాడేమో అనే అనుమానమూ రావచ్చు. కానీ ఈ రెండు మార్గాల్లోనూ వర్మ ‘క్లైమాక్స్’ను రిలీజ్ చేయట్లేదు. ఈ సినిమా విడుదల కోసం ఆయనే ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో సొంతంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ‘క్లైమాక్స్’ విడుదల కాబోతోంది.
ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి ‘క్లైమాక్స్’ స్ట్రీమింగ్ మొదలవుతుంది. పే పర్ వ్యూ.. లెక్కన సినిమా చూడొచ్చు. అంటే సినిమా చూసేందుకు థియేటర్లలో లాగే ఇక్కడా ఒక రేటు ఉంటుంది. ఆ మొత్తం చెల్లించి ఆన్ లైన్లో సినిమా చూడొచ్చు. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది. కొన్ని ప్రైమ్ సినిమాలకు 25 రూపాయలు.. 50 రూపాయలు అని రేటు పెట్టి చూసే అవకాశం కల్పిస్తారు. భవిష్యత్తులో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా కొన్ని సినిమాలకు ఇలా రేటు పెట్టే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఓటీటీ డీల్స్ కంటే కూడా సొంత ఛానెల్లో ఒక రేటు పెట్టి సినిమా చూసే అవకాశం కల్పిస్తే ఆదాయం ఎక్కువ వస్తుందని భావించి వర్మ ఈ ఏర్పాటు చేసుకున్నట్లున్నాడు. ఐతే మియా మాల్కోవా అందాల విందు మినహాయిస్తే మరే ఆకర్షణలూ కనిపించని ‘క్లైమాక్స్’ను డబ్బులు పెట్టి జనాలు ఏమాత్రం చూస్తారన్నది సందేహం.