లగడపాటితో నా స్నేహం.. కాలేజీలో ఇరగ్గొట్టుకున్నాంః రామ్ గోపాల్ వర్మ
సినిమాల్లోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఏంటనేది అందరికీ తెలుసు. కానీ.. ఇండస్ట్రీకి రాకముందు? ఆయన ఎలా ఉండేవాడు? ఏం చేసేవాడు? అనే విషయాలు తక్కువ మందికి తెలుసు. ఆర్జీవీ ‘నా ఇష్టం’ చదివిన వారికీ చాలా విషయాలు అర్థమవుతాయి. అయితే.. లగడపాటి రాజగోపాల్ తోకూడా తనకు స్నేహం ఉందని.. నాటి సీక్రెట్స్ రివీల్ చేశారు ఆర్జీవీ.
విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తాను చదువుకున్నట్టు వర్మ చాలా సార్లు చెప్పారు. అక్కడ తన స్నేహితుడు సత్యేంద్ర గురించి సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతుంటాడు. అయితే.. తన సహచరుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్నారని తాజాగా వెల్లడించారు. వాళ్లిద్దరూ కలిసి చేసిన పనుల గురించి కూడా చెప్పారు.
తమ కాలేజీలో నిత్యం గొడవలు జరుగుతుండేవని తెలిపారు వర్మ. ఆ సమయంలో లోకల్ - నాన్ లోకల్ వారీగా గ్రూపులు ఉండేవని, ఆ గ్యాంగ్ ల మధ్య తచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. నాన్ లోకల్స్, తామూ కలిసి ఇరగ్గొట్టుకునేవాళ్లమని తెలిపారు. ఓ సారి జరిగిన గొడవలో తానూ, లగడపాటి కలిసి అవతలి గ్యాంగ్ వారిని కొట్టినట్టు చెప్పారు.
1983 ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఆర్జీవీ. తాను మార్షల్ ఆర్స్ట్ ప్రాక్టీస్ చేసేవాడినని, నాన్ చాక్ తో కాలేజీకి వెళ్లిపోయేవాడినని చెప్పారు. ఓ సారి ప్రిన్సిపాల్ చూసి పేరెంట్స్ ను పిలిపించాడని చెప్పారు. మరోసారి పోలీస్ స్టేషన్ ముందుకు కూడా ఫ్యామిలీని నిలబెట్టారని తెలిపారు. మొత్తానికి.. అప్పట్లో అలా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత శివ తీసిన వర్మ.. ఆ సినిమాలో కాలేజ్ గొడవలనే చూపించడం విశేషం.