బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ చాలా మందిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్.. సల్మాన్ ఖాన్.. రియా చక్రవర్తిలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సుశాంత్ ప్రియురాలిగా ప్రచారం జరుగుతున్న రియా చక్రవర్తి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కాని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి కాని స్పందించలేదు. రియా చక్రవర్తి అటు పోలీసులకు కూడా టార్గెట్ అయ్యింది.
పోలీసులు మరియు ఫ్యాన్స్ ముప్పెట దాడితో రియా చక్రవర్తి తీవ్ర ఒత్తిడికి గురవుతుందట. కొన్ని రోజుల క్రితం ఈమె ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని పోస్ట్ చేసి కొందరు ఈమెను విమర్శిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ఒక కారణం రియా చక్రవర్తి కూడా అయ్యి ఉంటుందని పోలీసులు బలంగా నమ్ముతున్నారట.
సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సుసైడ్ నోట్ లభించక పోవడంతో పోలీసులు ఆయనకు సన్నిహితురాలిగా పేరున్న రియా చక్రవర్తిని సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ ఆమెను విచారించాల్సి ఉందని పోలీసులు అన్నారట. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న రియా చక్రవర్తికి ఇది కెరీర్ పరంగా చాలా ఇబ్బందికరంగా మారనుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అయినా రియా చక్రవర్తి సోషల్ మీడియా ద్వారా లేదంటే మీడియా ముందుకు వచ్చి నోరు తెరవాలంటూ సుశాంత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.