సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తర్వాత రోజులు గడిచే కొద్దీ సంచలనాత్మక రీతిలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్ సపోర్టర్స్ అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అనుమానిస్తూ వస్తున్నారు. ఇక సుశాంత్ సింగ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అనుమానితులుగా చేరుస్తూ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెపై మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ మరణాంతరం ఆయన మృత దేహాన్ని కూపర్ హాస్పిటల్ కు తరలించిన సమయంలో రియా చక్రవర్తి మార్చురీకి వెళ్లి సుశాంత్ మృతదేహాన్ని చూసింది. అయితే అప్పుడు ఆమె సుశాంత్ శరీరాన్ని తాకి మృతదేహానికి సారీ చెప్పారని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటున్న సుర్జీత్ సింగ్ రాథోర్ అనే వ్యక్తి వెల్లడించడం మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపింది.
కాగా సుర్జీత్ సింగ్ రాథోర్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. ''సుశాంత్ మృతదేహాన్ని చూడటానికి రియా చక్రవర్తి తన సోదరుడితో కలిసి కూపర్ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఎవరికి కనిపించకుండా మార్చురీలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయగా అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అక్కడ ఉండే సెక్యూరిటీని ప్రాధేయపడితే ఆమె ఒక్కరినే లోపలికి పంపించారు. మార్చురీలో సుశాంత్ బాడీపై ఉన్న క్లాత్ నేను తొలగించినప్పుడు.. రియా అతడి శరీరంపై చెయ్యి పెట్టి 'సారీ బాబూ' అని చెప్పింది. అతన్ని మృతదేహాన్ని చూస్తూ పెద్దగా ఏడ్చింది. వెంటనే నేను ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాను. ఆ సమయంలో ఆమె అపరాధభావంతో ఉన్నట్లు నాకు అనిపించింది'' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సుశాంత్ కేసుని విచారిస్తున్న సీబీఐ వారు పిలిస్తే వారికి సహకరిస్తానని సుర్జీత్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు సుశాంత్ కేసులో రియా ప్రమేయం ఉందని భావిస్తున్న వారందరూ 'రియా ఏ తప్పు చేయకపోతే.. సుశాంత్ మృతదేహానికి సారీ ఎందుకు చెప్పిందని' ప్రశ్నిస్తున్నారు.