సుశాంత్‌ : మీడియాపై సుప్రీంకు వెళ్లిన రియా

Update: 2020-08-10 14:42 GMT
సుశాంత్‌ మృతి చెంది దాదాపుగా రెండు నెలలు అవుతున్నా ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకోవడంతో పాటు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అంతా కూడా రియా చక్రవర్తిని టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు రియా చక్రవర్తిపై అనేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి సుప్రీం కోర్టుకు వెళ్లింది. తనపై అసత్య ప్రచారం చేయడంతో పాటు విచారణ జరుగుతున్న కేసులో తాను దోషిని అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కోర్టులో ఫిర్యాదు చేసింది.

మీడియాలో వస్తున్న కథనాలు తనకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఆమె పేర్కొంది. సుప్రీం కోర్టులో రియా వేసిన పిటీషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది. రియా పై అసత్య కథనాలు ప్రసారం చేసే మీడియాకు మరియు ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన ఎంక్వౌరీ జరుగుతుంది. ఆ కేసు గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం స్పందించడం చేస్తున్నారంటూ కూడా రియా తన పిటీషన్‌ లో ఆవేదన వ్యక్తం చేసింది.
Tags:    

Similar News