ప్ర‌భాస్ కోసం రాజ్ త‌రుణ్ హీరోయిన్?

Update: 2022-11-26 12:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మూడు సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో క‌లిసి చేస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా 'ఆదిపురుష్‌'. టి సిరీస్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. 3డీ ఫార్మాట్ లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు 'కేజీఎఫ్‌' డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో 'స‌లాల్‌' మూవీ చేస్తున్న ప్ర‌భాస్ ఈ మూవీతో పాటు 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్వ‌న్ తెర‌కెక్కిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె'లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ రెండు పాన్  ఇండియా మూవీస్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే ప్ర‌భాస్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో పాటు ప్ర‌భాస్ తాజాగా మారుతి సినిమాని కూడా లైన్ లో పెట్టేశాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో మార‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఇటీవ‌లే సైలెంట్ గా ప్రారంభించి స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా షూటింగ్ చేస్తూ వెళుతున్నారు.

ఈ మూవీలో ప్ర‌భాస్ కి జోడీగా ముగ్గురు క్రేజీ హీరోయిన్ లు న‌టించ‌నుండ‌గా ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్ లని ఫైన‌ల్ చేశారు. తాజాగా మూడ‌వ హీరోయిన్ ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలిసింది. మెయిన్ హీరోయిన్ గా మాళ‌వికా మోహ‌న‌న్ ని ఎంపిక చేశారు.

ఇక రెండ‌వ నాయిక‌గా నిధి అగ‌ర్వాల్ ని ఫైన‌ల్ చేయ‌గా తాజాగా మూడ‌వ నాయిక‌గా రిద్ది కుమార్ ని ఎంపిక చేసిన‌ట్టుగా తెలుస్తోంది. రాజ్ త‌రుణ్ న‌టించిన 'ల‌వ‌ర్‌' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన రిద్ది కుమార్ ఈ ఏడాది విడుద‌లైన 'రాధేశ్యామ్‌ లోనూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇప్ప‌డు ఏకంగా ప్ర‌భాస్ కు జోడీగా న‌టించే ఛాన్స్ ని సొంత చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఇదే ఏడాది రిద్ది కుమార్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోంది.

కాజోల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న హిందీ మూవీ 'స‌లామ్ వెంకీ'. న‌టి రేవ‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీతో రిద్ది కుమార్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇలాంటి టైమ్ లో ప్ర‌భాస్ - మారుతిల మూవీలో త‌న‌కు మూడ‌వ మీరోయిన్ టా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News