కాంతార హీరో ఫేస్‌ బుక్ ప్రేమ గురించి మీకు తెలుసా?

Update: 2022-10-29 07:32 GMT
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంతార సినిమా యొక్క పేరు మారు మ్రోగి పోతున్న విషయం తెల్సిందే. హిందీలో దాదాపుగా 30 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసిన కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల కలెక్షన్స్ ను నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక కన్నడంలో అత్యధికులు చూసిన సినిమా గా కాంతార రికార్డును నమోదు చేయడం జరిగింది.

ఒక చిన్న సినిమా గా రూపొందిన కాంతార సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం రిషబ్‌ శెట్టి యొక్క నటన. అతడు క్లైమాక్స్ తో పాటు సినిమా ఆరంభం నుండి చూపించిన నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు.

రిషబ్ శెట్టి గురించి ఇన్నాళ్లు కన్నడ వాళ్లు మినహా మరెవ్వరు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు రిషబ్‌ శెట్టి గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆయన గత సినిమాలు.. ఇండస్ట్రీలో ఎలా అడుగు పెట్టాడు అనే విషయాలు మొదలుకుని ప్రేమ పెళ్లి గురించి ప్రచారం జరుగుతోంది.

కాంతార హీరో రిషబ్‌ శెట్టి పెళ్లి చాలా నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాగినట్లుగా కన్నడ మీడియా కథనాలను బట్టి అర్థం అవుతోంది. 2017 సంవత్సరంలో రిషబ్ శెట్టి తన ప్రియురాలు ప్రగతి ని వివాహం చేసుకున్నాడు.

ప్రగతికి రిషబ్‌ కి మధ్య ఫేస్‌ బుక్ ద్వారా అయ్యింది. ఫేస్ బుక్ లో చాటింగ్‌ చేసి ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. రిషబ్ తో ప్రగతి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ప్రగతి తల్లిదండ్రుల నుండి అంగీకారం రాకపోవడంతో చాలా తిప్పలు పడి మరీ రిషబ్ శెట్టి తన ప్రేమను దక్కించుకున్నట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు.

ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం అయ్యి చాటింగ్‌ చేసుకుంటూ ప్రేమించుకున్న ఈ జంట గురించి ప్రస్తుతం ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. వీరికి ఇద్దరు సంతానం. రిషబ్ శెట్టి కాంతార సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయితే తాను కన్నడం లో మాత్రమే సినిమాలు చేస్తాను అంటూ రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News