టాలీవుడ్ లో పరభాషా అమ్మాయిలు ఎక్కువగా హీరోయిన్స్ గా వెలుగుతున్న సంప్రదాయం గురించి తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో కొందరు తెలుగు భామలు కూడా కొంచెం కొంచెం గా స్టార్స్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే కాస్త గ్లామర్ డోస్ ని పెంచి మరీ పరభాషా ముద్దుగుమ్మలు ధీటుగా పోటీని ఇస్తున్నారు.
ఇప్పుడు అదే తరహాలో కొంతమంది తెలుగు భామలు ప్రయత్నాలు చేస్తున్నా.. తెలంగాణ సిద్దిపేట అమ్మాయి రీతూ వర్మ మాత్రం తనదైన శైలిలో డీసెంట్ గా కనిపిస్తూ.. డీసెంట్ హిట్స్ ను అందుకుంటోంది. ఎన్టీఆర్ - బాద్షా సినిమాలో చిన్న పాత్రతో తెరగ్రేటం చేసిన రీతూ ఆ తర్వాత చిన్న సినిమాల్లో మెరిసి ఎవడే సుబ్రహ్మణ్యం లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆ హిట్ తో పెళ్లి చూపులు సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసి డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగు - తమిళ్ అని తేడా లేకుండా బిజీ అయిపోయింది. ముఖ్యంగా గౌతమ్ మీనన్ - విక్రమ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ దేసింగ్ పెరియసామి అనే యువకుడు మొదటి సారి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే సల్మాన్ కి జోడిగా ఎంతోమందిని చూసిన దర్శకుడు ఫైనల్ గా రీతూ వర్మను ఒకే చేసేసాడట. రీతూ కూడా కథ వినగానే.. బిజీగా ఉన్నా సరే డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చివరగా అమ్మడు నిఖిల్ - కేశవ అండ్ విఐపి -2 లో కనిపించింది. ఆ సినిమాలో న టనపరంగా మంచి మార్కులే కొట్టేసిన రీతూ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో అయినా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుందో లేదో చూడాలి.