లోటు భర్తీకి చైనాలో 56 వేల స్క్రీన్స్‌లో...!

Update: 2018-12-05 05:32 GMT
2.ఓ చిత్రం ఇండియాలో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోతుంది. 3డి వర్షన్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నా కూడా ఎక్కువ త్రిడి థియేటర్లు లేక పోవడం వల్ల కలెక్షన్స్‌ జోరు కొనసాగడం లేదు. 2డి థియేటర్ల నుండి ఈ చిత్రంను తీసేసే పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా ఈ చిత్రం అంతత మాత్రంగానే వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర డిస్ట్రిబ్యూట్‌ రైట్‌ దక్కించుకున్న నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. నిర్మాతలు కూడా ఈ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇక్కడ సాధ్యం కాని వసూళ్లను చైనాలో రాబట్టేందుకు లైకా ప్రొడక్షన్స్‌ ప్రయత్నాలు చేస్తోంది.

ఇండియన్‌ సినిమాలకు ఈమద్య కాలంలో చైనాలో మంచి మార్కెట్‌ ఉంది. దంగల్‌ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రంను కూడా చైనాలో విడుదల చేయాలని భావిస్తున్నారు. చైనాలో 10 వేల థియేటర్లలో విడుదల చేయనున్నారట. థియేటర్ల సంఖ్య పక్కన పెడితే ఏకంగా 56 వేల స్క్రీన్స్‌ లో ఈ చిత్రం ఒకే సారి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ 56 వేల స్క్రీన్స్‌ లో 47 వేల స్క్రీన్స్‌ 3డి స్క్రీన్స్‌ అవ్వడం విశేషం.

చైనాలో ఫిబ్రవరి 1న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చైనాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అయిన హై మీడియాతో లైకా ప్రొడక్షన్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. చిత్ర ముఖ్య యూనిట్‌ సభ్యులు చైనా వెళ్లి మరీ ప్రచారం చేయనున్నారట. తప్పకుండా ఇక్కడ రాబట్టలేని వసూళ్లను అక్కడ రాబట్టి ఏదో ఒక విధంగా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయాలని శంకర్‌ అండ్‌ టీం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News