రోగ్ లో పూరీ పండించేసినట్లున్నాడు

Update: 2017-03-14 07:23 GMT
దర్శకుడు పూరీ జగన్నాధ్ సినిమాల్లో హీరోయిజం ఏ రేంజ్ లో ఉంటుందో.. డైలాగ్స్ ఏ స్థాయిలో పండుతాయో.. దానికి సమానమైన ఎలిమెంట్ మరొకటి ఉంటుంది. అదే హీరో హీరోయిన్స్ మధ్య సాగే రొమాన్స్. ఎంత సీరియస్ టోన్ తో సాగే సబ్జెక్ట్ లో అయినా.. రొమాంటిక్ ట్రాక్ ను కథలో భాగం అనిపించేసేలా మిక్స్ చేసేయడం పూరీ స్పెషాలిటీ.

అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఓ స్పెషల్ రొమాంటిక్ సాంగ్ ను తీయడం పూరీ సినిమాల్లో ఆనవాయితీ. అదే ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగిస్తూ.. తన లేటెస్ట్ చిత్రం రోగ్ లో కూడా రొమాన్స్ పండించేస్తున్నాడు. 'తొలి పరవశమే' అంటూ హీరో ఇషాన్.. హీరోయిన్ మన్నారా చోప్రాల మధ్య వచ్చేసాంగ్ ను కొండకోనల్లో సెలయేటి గట్లు.. జలపాతాల మధ్య చిత్రీకరించాడు. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూస్తే.. ఈ పాటను పూరీ ఎంత ప్రత్యేకంగా తీసుకున్నాడనే విషయం అర్ధమవుతుంది.

హీరోయిన్ అందాలను అంత ఎక్కువగా చూపించకపోయినా.. డ్రెసింగ్ లోను.. పిక్చరైజేషన్ తీరులోను మాత్రం అద్భుతంగా అనిపించక మానదు. అలాగే లిరికల్ సాంగ్ కూడా వినసొంపుగా ఉండడం.. పూరీ రొమాంటిక్ టేకింగ్ సూపర్బ్ గా ఉండడంతో.. పాట శ్రవణానందం.. నయనానందం కలిగించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News